Tamil Nadu Youth Collects Re 1 Coins For 3 Years To Buy Dream Bike. It Took 10 Hours To Count Them
Tamil Nadu Youth : అతడికి బైక్ కొనాలనేది మూడేళ్ల డ్రీమ్.. అప్పటినుంచి బైక్ కోసం డబ్బులు కూడబెట్టాడు. అన్నీ చిల్లర నాణేలే.. ఒక రూపాయి నాణాలను మూడేళ్లుగా సేకరిస్తూ వచ్చాడు. అలా మొత్తంగా రూ.2.6 లక్షలు పోగేశాడు. ఆ చిల్లరతో నేరుగా బైక్ షోరూం వద్దకు చేరుకుని తనకు నచ్చిన కొత్త బజాజ్ డామినార్ బైక్ (new Bajaj Dominar) కొనుగోలు చేశాడు. తమిళనాడులోని సేలంకు చెందిన (V Boobathi) అనే యువకుడు బైక్ కొనాలనే డ్రీమ్ ఇలా నెరవేర్చుకున్నాడు.
బైక్ షోరూంకు ఒక రూపాయి నాణేలలో రూ. 2.6 లక్షలు చెల్లించి ఆ బైకును సొంతం చేసుకున్నాడు. వి బూబతి యువకుడు మూడు ఏళ్లలో రూ. 1 నాణెలను సేకరించాడు. అలా పొదుపు చేసిన చిల్లర మొత్తాన్ని షోరూమ్‌కి తీసుకెళ్లి కొత్త బజాజ్ డామినార్‌ని కొనుగోలు చేశాడు. అయితే.. రూపాయి నాణేలను లెక్కించలేక షోరూం సిబ్బంది అపసోపాలు పడ్డారు. బూబతి తీసుకొచ్చిన మూడేళ్లుగా పొదుపు చేసిన చిల్లర నాణేలను లెక్కించేందుకు 10 గంటల సమయం తీసుకున్నారని భారత్ ఏజెన్సీ మేనేజర్ మహావిక్రాంత్ తెలిపారు.
Tamil Nadu Youth Collects Re 1 Coins For 3 Years To Buy Dream Bike. It Took 10 Hours To Count Them
బూబతి బిసిఎ గ్రాడ్యుయేట్, నాలుగేళ్ల క్రితం యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించే ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. అప్పట్లో బైక్ ఖరీదు రూ.2 లక్షలు ఉంది. ఎలాగైనా తన డ్రీమ్ బైక్ కొనాలని డిసైడ్ అయ్యాడు. మూడేళ్ల క్రితం నుంచే ఒక రూపాయి నాణేనలను సేకరించి తన పిగ్గీ బ్యాంకులో వేస్తూ వచ్చాడు. అలా రూ.2లక్షలపైగా పోగోయ్యాక ఆ చిల్లర నాణేలతో బైక్ షోరూంకు వెళ్లి నచ్చిన బైక్ కొని తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియా అకౌంట్లలో వైరల్ అవుతోంది.
Read Also : Tamil Nadu students: బస్సులోనే మద్యం తాగేస్తున్న స్టూడెంట్స్.. వైరల్‌గా మారిన వీడియో