Tamilnadu 56 Elephants In Two Camps Undergo Covid 19 Tests
Tamilnadu : తమిళనాడులో ఇవాళ 56 ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలలో 2 శిబిరాలు ఏర్పాటు చేసి ఏనుగులకు మంగళవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల చెన్నై వండలూరులోని అన్నా జులాజికల్ పార్క్ లోని ఒక సింహాం కోవిడ్ సోకి మరణించింది. అధికారులు మిగిలిన సింహాలకు కూడా పరీక్షలు నిర్వహించగా ఇంకో 9 సింహాలకు పాజిటివ్ రావటంతో అధికారులు ఈరోజు ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఏనుగుల నుంచి తీసిన నమూనాలను ఉత్తరప్రదేశ్ లోని ఇజ్జత్ నగర్ లోని ఇండియన్ వెటర్నరీ రీసెర్ట్ ఇనిస్టిట్యూట్ కు పంపించారు. ఈశిబిరంలో మావటిలకు, వారి కుటుంబ సభ్యులతో కలిపి 60 మందికి వ్యాక్సిన్ వేశారు.
అటవీ శాఖమంత్రి కె.రామచంద్రన్ పర్యవేక్షణలో కోయంబత్తూరు జిల్లాలోని కోజిక్‌ముడి శిబిరంలో 28 ఏనుగులకు, నీలగిరి జిల్లాలోని ముదుమలై వద్ద ఉన్న తెప్పకాడు శిబిరంలో 28 ఏనుగులకు పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి అటవీ సిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ చేశారు.