రోడ్డు పక్కనే నవాబుల కాలంనాటి నాణాలు..ఏరుకున్న జనాలు

  • Publish Date - October 12, 2020 / 11:23 AM IST

Tamilnadu: కొంతమంది రోడ్డుపక్కగా నడిచి వెళుతున్నారు.యథాలాపంగా రోడ్డు పక్కన చూడగా మట్టిలో ఏవో మిలమిలా మెరిస్తూ కనిపంచాయి. దీంతో ఆగిపోయన జనాలు అవేంటాని..మట్టిలోంచి తీసి చూసారు. వెండి..బంగారు రంగుల్లో మెరిసిపోతున్న ఆ నాణాలను చూసి..ఆశ్చర్యపోయారు.




తెగ ఆనంద పడిపోతూ..అలా ఇంకా దొరుకుతాయని వెదకగా ఒకటీ రెండూ మూడు కనిపించాయి. దీంతో దారవెంట వెళ్లేవారంతా వెళ్లే పని మానేసి మట్టిన తవ్వుతూ నాణాల వేటలో పడ్డారు. ఈ విషయం చుట్టుపక్కల తెలిసేసరికి జనాలు బాగా ఎగబడ్డారు. తమిళనాడులో కృష్ణగిరి జిల్లా హోసూరులో జరిగిందీ ఘటన.


గుప్తనిధుల కోసం అర్ధరాత్రి పాడుబడిన ఆలయాలను, కోటలను తవ్వేసే ఘటనల గురించి తరచూ వింటున్నాం. గుప్త నిధుల కోసం నరబలులు జరిగిన దారుణ ఘటనల గురించి కూడా విన్నాం. అటువంటిదో రోడ్డు పక్కన నాణాలు కనిపిస్తే జనాలు ఊరుకుంటారా? ఎగబడి మరీ ఏరుకున్నారు. మట్టి తవ్వి దొరికిన వాటిని దొరికినట్లు పట్టుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నాణాలు ఏరుకునేవారిని అడ్డుకున్నారు. వారి నుంచి నాణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నాణాలు విలువైన నాణేలు మట్టిదిబ్బల కిందికి ఎలా వచ్చాయని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


హోసూరు పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద రోడ్డుపక్క మట్టిదిబ్బల్లో నాణేలు లభ్యమైన ఈ నాణాలు ఒక్కోటి రెండు గ్రాముల బరువు ఉంది. వాటిపై అరబిక్ అక్షరాలు ఉన్నాయని, ఆర్కాట్ నవాబుల కాలం నాటివి కావొచ్చుని భావిస్తున్నారు. ఈ నాణేలు మొదట ఎవరి కంట పడ్డాయో వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.