Sunday Lock Down : కరోనా కట్టడికి ప్రతి ఆదివారం లాక్ డౌన్ … ఎక్కడంటే…

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం తమిళనాడుతోపాటు మరో 7 రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Sunday Lock Down :  కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం తమిళనాడుతో పాటు మరో 7 రాష్ట్రాల్లో   అత్యధిక స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రతి ఆదివారం రాష్ట్రంలో పూర్తి స్ధాయిలో లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. జనవరి 9 నుంచి ఆదివారం లాక్‌డౌన్‌ అమల్లోకొచ్చింది. నేడు రెండో ఆదివారం కావడంతో తమిళనాడు లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగాకనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా రాష్ట్రంలోని రెస్టారెంట్లు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు తెరిచి ఉంటాయి. ఫుడ్ ఐటెమ్స్ టేక్ అవే, హోమ్ డెలివరీ పద్ధతిలో మాత్రమే వాటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవాల్సి ఉంటుందని పేర్కోంది. నిత్యావసర సేవలలో పాల్గోనే ఉద్యోగులు తమ పనికి వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు.

కోవిడ్ నివారణలో భాగంగా జనవరి 9 నుంచి రద్దీగా ఉండే రహదారులు, మార్కెట్లు, మాల్స్‌తోపాటు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం 75% ఆక్యుపెన్సీతో ప్రయాణాలకు అనుమతిచ్చింది. అంతేకాకుండా జనవరి 14 – 18 వరకు రద్దీని నివారించేందుకు అన్ని ప్రార్ధనా స్థలాలను ప్రభుత్వం మూసివేసింది.
Also Read : Secunderabad Club : సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం… కోట్లలో ఆస్తి నష్టం
ఐతే ఆదివారం లాక్‌డౌన్ సమయాల్లో.. విమానాలతో సహా ఇతర పబ్లిక్‌ రవాణా సేవలు తప్ప, మిగతా అంతటా పూర్తి స్థాయిలో లాక్‌డైన్‌ అమల్లో ఉంటుంది. వివాహాలు, వేడుకలకు 100 మందికి మించి పాల్గొనరాదు. 1 నుంచి 9 తరగతుల పాఠశాలలను మూసి వేశారు. 50 శాతం పరిమిత సీటింగ్‌ కెపాసిటీతో కోచింగ్‌ సెంటర్లు, పబ్లిక్‌ రవాణా సేవలపై విధించిన పరిమితులు జనవరి 31 వరకు కొనసాగుతాయి. జనవరి 6 నుంచి విధించిన రాత్రి కర్ఫ్యూ (రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలవరకు) ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు