కరోనా వారియర్స్ గా సొసైటీలో నేడు పనిచేస్తున్న విభాగాల్లో ప్రధానమైనవి ఆస్పత్రులు…. పోలీసు స్టేషన్లే…. ఆస్పత్రులు,వైద్యులు ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే… పోలీసులు అందరికీ రక్షణగా ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోం చేస్తున్నా….. కరోనాతో పోరాడుతూ బయటకు వచ్చి ముందుండి పోరాడుతున్నది డాక్టర్లు, పోలీసులే. ఆ క్రమంలో కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోతున్నవారిలో పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
ఈ పరిస్ధితుల్లో తమిళనాడు పోలీసులు యమధర్మరాజుకు ఓ అప్పీల్ చేసుకున్నారు. తమ జీవిత కాలాన్ని పెంచమని వేడుకుంటు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యుముడితో ఎలాంటి సంబంధం ఉండకూడదని కోరుకునే ఓ పోలీసు అధికారి ఆ లేఖ రాస్తున్నట్లు పేర్కోన్నారు.
మధురైకి చెందిన పోలీసులు రాసిన లేఖలో…. “మేం ఎంతటి బాధల్లో ఉన్నా…. ప్రజల జీవితాన్ని కాపాడటమే అంతిమ లక్ష్యంగా ముందుండి పోరాడుతున్నాము. కాబట్టి మా జీవిత కాలాన్ని దయాగుణంతో పొడిగించమని మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాం.
మా బాధ్యతలను నెరవేర్చామని అనుకుంటే….ఈ దేశానికి ఉపయోగ పడే మరణం మాకుందని భరోసా ఇవ్వండి. అలాంటి మరణమే మాకు కావాలి. ఈ లేఖ స్వీకరించిన తర్వాత పోలీసుల మరణాలపై మీరు కొంత దయ చూపిస్తారని నమ్ముతున్నాం” అని ఉంది.