Toothbrush Got Stuck In Women Mouth After She Fell
Tamilnadu : బాత్రూమ్ లో కాలు జారి పడిపోయిన ఓ మహిళకు లేనిపోయి కష్టం వచ్చిపడింది. బాత్రూమ్ లో కాలుజారి పడితే ఏ కాలో చెయ్యి విరిగింది అనే మాట విన్నాం.కానీ తమిళనాడులోని కాంచిపురంలో ఓ మహిళకు మాత్రం కాలు విరిగలేదు. చెయ్యి విరగలేదు. అంతా బాగానే ఉంది. కానీ ఆమె గొంతులో టూత్‌బ్రష్ ఇరుక్కుపోయింది. దీంతో ఆమెను బంధువులు హాస్పిటల్ కు తరలించటంతో డాక్టర్లు నానా పాట్లు పడి ఆ బ్రష్ ను బయటకు తీశారు.
కాంచీపురంలో 34 ఏళ్ల రేవతి అనే మహిళ ఉదయమే బ్రష్ చేసుకుంటోంది. పొరపాటున కాలు జారి వాష్‌రూమ్‌లో పడిపోయింది. దీంతో తన తల నేలకు గట్టిగా తాకింది. దీంతో తన నోటిలో ఉన్న బ్రష్ తన గొంతులో ఇరుక్కుపోవడమే కాదు.. తన చెంపను చీల్చుకుంటూ సగం బయటకు వచ్చింది.
వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు కాంచిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితిని చూసిన డాక్టర్లు.. ఆ టూత్‌బ్రష్.. రేవతి చెంపను చీల్చుకుంటూ సగం బయటికి రావడం వల్ల చెంప నుంచే దాన్ని బయటకు అత్యంత జాగ్రత్తగా బయటకు తీశారు.
పాపం ఆమెకు టూత్‌బ్రష్.. పళ్ల కింద ఇరుక్కుపోయింది. దీంతో చెంపపై ఇంకాస్త గాటు పెట్టి..నోటి లోపల ఇరుక్కుపోయిన బ్రష్‌ను బయటికి జాగ్రత్తగా తీయగలిగారు డాక్టర్లు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.