Free Biryani : ఈ అమ్మకు హ్యాట్సాఫ్..“ఆకలేస్తోందా? రండి ఈ బిర్యానీ తినండీ..

Tamilnadu women biryani for free  : ‘మానవత్వం పరిమళించే మంచి మనస్సుకు స్వాగతం..అనే పాట గుర్తుందా? గుర్తు లేకపోతే ఇది ఈ అమ్మను చూడండీ..‘మీకు ఆకలేస్తోందా? అయితే రండి ఈ ఘుమఘుమలాడే బిర్యానీ తినండి- ప్రేమతో’ అని బోర్డు పెట్టి మరీ పిలుస్తోంది ఓ అమ్మ. అమ్మంటే అన్నపూర్ణే. ఆకలితో ఎవరు ఉన్నా అమ్మ మనస్సు కదలిపోతుంది.

అందుకే ఉచితంగా బిర్యానీ పెట్టి ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతోందీ అమ్మ. అమృతమయి అయిన ఆ అమ్మ పేరు ‘ అమ్మ’. కోయంబత్తూరులోని రోడ్డు పక్కన బిర్యానీ చేసి అమ్ముతూ జీవనం సాగిస్తోందా అమ్మ. రోజు కష్టపడితేనే గానీ వారి జీవనం గడవదు. అంత పేదరికంలో ఉన్నాగానీ ఆమెలో అమ్మ మనస్సు చాటుకుంటునే ఉంది. ఆకలితో ఉన్నవారికి బిర్యానీ పెట్టి కడుపు నింపుతూ ఉంది. ఇటీవల రేడియో జాకీ-నటుడు ఆర్జే బాలాజీ ట్విట్టర్‌ పోస్ట్‌లో రెండు ఫోటో షేర్ చేశారు. “కోయంబత్తూరులోని పులియాకుళంలోని ఓ చిన్న రోడ్డు పక్కన ఉన్న బిర్యానీ షాపు సమాజానికి ఎంత గొప్ప సంకేతాలు పంపుతోందా అమ్మ మానవత్వానికి ఇదే నిదర్శనం. ” అని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టారు.

ఈ ఫోటోలలో ఒకటి రోడ్డు పక్కన ఉన్న బిర్యానీ స్టాల్‌ కనిపిస్తోంది. మరో ఫోటోలో పక్కనే ఓ బోర్డు ఉంది. ఆ బోర్డు కింద కొన్ని ఫుడ్ ఫ్యాకెట్స్ ఉన్నాయి. ఆ బోర్డుమీద తమిళంలో కొన్ని వ్యాఖ్యాలు రాసి ఉన్నాయి. తెలుగులో వాటి అర్థం..“మీకు ఆకలిగా ఉందా, అయితే ఈ ఫుడ్ ఫ్యాకెట్స్ ఉచితంగా తీసుకోండి …. ప్రేమతో” అని రాసి ఉంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆ షాపు అమ్మని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.నిజంగా ఆమే అమ్మే..అమ్మ మనసు ఇలా ఎప్పుడూ గొప్పగానే ఉంటుందని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు