Tamilnadu women onion ‘smart godown’ : ప్రస్తుతం ఉల్లి ధర చుక్కలు చూపిస్తున్నాయి. కిలో ఉల్లి రూ.100 నుంచి రూ.120 పైనే అమ్ముతోంది. ఒక్కోసారి రూ.10లకే అమ్మే ఉల్లి మరోసారి రూ.100దాటిపోతుంటుంది. సముద్రపు కెరటాలల్లా ఉల్లి ధరలు ఎగసిపడుతుంటాయి. ఒక్కోసారి కొనేవాడికి కన్నీళ్లు తెప్పిస్తే..మరోసారి ఉల్లి పంట వేసిన రైతుకు కన్నీరు తెప్పిస్తాయి. ధరల్లో ఈ తేడాలతో జనాలు హడలిపోతుంటారు.
దీనికి కారణం మనదేశంలో ఉల్లిగడ్డలను నిల్వ చేసే పద్ధతి సరిగ్గా లేకపోవడమే. కానీ ఇప్పుడా సమస్యకు చక్కటి పరిష్కారాన్ని కనిపెట్టారు కళ్యాణి షిండే అనే 23 ఏళ్ల మహిళ. ఆసియాలో అతిపెద్ద ఉల్లి మార్కెట్‌కు నిలయమైన లాసల్‌గావ్‌లో పుట్టి పెరిగిన 23 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కల్యాణి షిండే. స్టార్టప్ తో ఉల్లిగడ్డల్ని నిలువ చేసే గిడ్డంగిని కనిపెట్టారు కళ్యాణి.
https://10tv.in/reasons-behind-onion-price-soars/
ప్రపంచంలో ఉల్లిగడ్డలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. 2019-2020 సంవత్సరంలో 11.5 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో 30 శాతం దాకా ఒక్క మహారాష్ట్రలోనే పండింది అంటే ఉల్లి పంటలో మహారాష్ట్ర రేంజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ అత్యంత భారీగా దిగుబడి అయిన ఉల్లిగడ్డలను నిల్వ చేసే సరైన పద్ధతి లేకపోవటంతో ఉల్లిగడ్డలు పాడైపోతుంటాయి. ఇదే సమయంలో వర్షాలు కాస్త ఎక్కువగా పడితే చాలు ఉల్లిధరలు ఆకాశంలో ఉంటాయి.
ఉల్లిగడ్డల్ని సంప్రదాయ గిడ్డంగుల్లో నిల్వ ఉంచడం చాలా కష్టం. ఎందుకంటే, ఒక్క ఉల్లిగడ్డ పాడైనా, అది అన్ని ఉల్లిగడ్డల్ని పాడుచేస్తుంది. ఈ సమస్యకు ‘గోదామ్ స్మార్ట్ గిడ్డంగి’తో పరిష్కారం చూసారు కళ్యాణి షిండే. మహారాష్ట్రలోని లాసల్ గావ్ లో ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఉంది.
దీంతో సహజంగానే ఉల్లిసాగు, నిల్వపై కళ్యాణికి పూర్తి అవగాహన ఉండటంతో ఉల్లి గడ్డలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడాన్ని గమనించారు కళ్యాణి. తన ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ పరిజ్ఞానంతో స్మార్ట్ గిడ్డంగిని నిర్మించారు కళ్యాణి.
ఈ గోడౌన్‌లో అతిసూక్ష్మమైన వాతావరణ మార్పులను కూడా పసిగట్టగలిగే సెన్సర్లను ఏర్పాటు చేశారు కళ్యాణి. ఈ సెన్సార్ పాడయ్యే ఉల్లిగడ్డను ముందే గుర్తిస్తుంది. దీంతో చెడిపోయిన ఉల్లి నుంచి వచ్చే వాయువు, గోడౌన్ మొత్తం వ్యాపించకుండా నిరోధిస్తుంది. రైతులను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది.
ఫలితంగా మిగతావి పాడవకుండా చూసుకునే అవకాశం కలుగుతుంది. ఈ స్మార్ట్ గోడౌన్ ద్వారా 20 నుంచి 30 శాతం దాకా ఉత్పత్తిని కాపాడుకోవచ్చునని కళ్యాణి చెబుతున్నారు. ఇది ఉల్లి రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనీ..సంప్రదాయ గిడ్డంగులను స్మార్ట్ గిడ్డంగుల మార్చాలనే లక్ష్యంగా పనిచేస్తున్నానని కళ్యాణి షిండే తెలిపారు. ఈ స్మార్ట్ గిడ్డంగు పనితనం గురించి కళ్యాణి ఉల్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
కష్టపడి పండించిన పంట పాడవ్వకుండా ఉల్లి కొరత రాకుండా చేసుకోవటానికి స్మార్ట్ గిడ్డంగులు ఎలా ఉపయోగపడతాయో వివరిస్తున్నారు.