కరోనా పాజిటివ్ వచ్చిందంటే అతనికి ఎలా సోకిందో అనే ఆరా కంటే ఎవరెవరిని కలిశాడో అనేదే ఇంపార్టెంట్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే టీ అమ్మే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తెలిస్తే ఇంకేమైనా ఉందా.. అది సీఎం ఇంటికి సమీపంలో టీ స్టాల్ నడుపుతున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ దగ్గర్లోని ప్రాంతాలన్నీ సీల్ చేశారు.
మహారాష్ట్రలోని మాతోశ్రీ సమీపంలో ఓ వ్యక్తి టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు. మహారాష్ట్ర బాంద్రాలోని సీఎం ఉద్దవ్ ఠాకరే ఇంటికి దగ్గర్లో ఉండే వ్యక్తికి కరోనా పాజిటివ్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పరిసర ప్రాంతాలన్నీ సీల్ వేసినట్లుగా వెల్లడించారు.
దేశంలో మహారాష్ట్ర ఇప్పటికే కరోనా కేసుల్లో టాప్ గా ఉంది. 120 తాజా కేసులు నమోదుకాగా మొత్తంగా 868 కి పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారతదేశంలో ఇప్పటికీ 4వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా, 109మంది ప్రాణాలు కోల్పోయారు.