Teacher Suspend
Tamilnadu: ఆరో తరగతి స్టూడెంట్ చేసిన కంప్లైంట్ కు స్కూల్ టీచర్ ను సస్పెండ్ చేశారు అధికారులు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ ఘటన నమోదైంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్లాసురూంలోనే మతమార్పిడికి ప్రేరేపిస్తూ బోధనలు చేస్తుందని టీచర్ కంప్లైంట్ ఇచ్చాడు ఆరో తరగతి విద్యార్థి. కన్నాటువిలై ప్రభుత్వ పాఠశాలలో బుధవారం జరిగిన ఘటనను ఓ బాలిక లేవనెత్తడంతో వైరల్ గా మారింది.
ఈ ఘటన అనంతరం ఆరో తరగతి విద్యార్థి పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పాఠశాలలో చదువుతున్న 300 మంది విద్యార్థులను ఎంక్వైరీ చేసి కన్ఫామ్ చేసుకున్నారు. బైబిల్ చదవమని, లంచ్ బ్రేక్‌లో తనతో పాటు ప్రార్థనలో జాయిన్ అవ్వాలని చెబుతుండేదని స్టూడెంట్స్‌లో ఒకరు బదులిచ్చారు.
“ఆమెకు చెప్పాను. మేం హిందువులం బైబిల్ చదవం. భగవద్గీత మాత్రమే చదువుతామని చెప్పాం. తనకు ఆమె భగవద్గీత మంచిది కాదు” అని విమర్శించిందని అంతేగాకుండా హిందువులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని విద్యార్థి ఆరోపించాడు. పలు క్లాసుల నుంచి విద్యార్థులను పిలిపించి మోకాళ్లపై కూర్చోబెట్టి ప్రార్థనలు చేసేదని వివరించాడు.
Read Also: పరీక్ష రాసేందుకు స్టూడెంట్‌ను హిజాబ్‌తో అనుమతించిన టీచర్ సస్పెండ్
కన్యాకుమారి చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పుగజేంధీ, డీఈఓ ఎంపెరుమాల్ స్కూల్ కు వెళ్లి ఎంక్వైరీ చేశారు. విద్యార్థి మతమార్పిడి ఆరోపణల తర్వాత ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశించారు.