Hijab Row: పరీక్ష రాసేందుకు స్టూడెంట్‌ను హిజాబ్‌తో అనుమతించిన టీచర్ సస్పెండ్

ర్ణాటకలోని కాలాబురాగీ జిల్లాలో హిజాబ్ అంశంపై మరో టీచర్ సస్పెండ్ అయ్యారు. గురువారం పరీక్ష జరుగుతున్న సమయంలో హిజాబ్ ధరించి రాసేందుకు అనుమతించిందామె.

Hijab Row: పరీక్ష రాసేందుకు స్టూడెంట్‌ను హిజాబ్‌తో అనుమతించిన టీచర్ సస్పెండ్

Hijab Row

Hijab Row: కర్ణాటకలోని కాలాబురాగీ జిల్లాలో హిజాబ్ అంశంపై మరో టీచర్ సస్పెండ్ అయ్యారు. గురువారం పరీక్ష జరుగుతున్న సమయంలో హిజాబ్ ధరించి రాసేందుకు అనుమతించిందామె. రెండ్రోజుల్లో జరిగిన రెండో ఘటన ఇది.

బుధవారం గదగ్ జిల్లాలో గర్ల్ స్టూడెంట్స్ ను పరీక్ష రాసేందుకు అనుమతించడంతో ఏడుగురు టీచర్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై కాలాబురాగి జిల్లా అధికారులపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి హిజాబ్ అంశం చర్చనీయాశంగా మారింది. విద్యా సంస్థల్లోకి హిజాబ్ తో అనుమతించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిపారు.

ఈ మేరకు హిజాబ్ నిషేదాన్ని ఛాలెంజ్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో వేసిన పిటిషన్లను త్రిసభ్య బెంచ్ కొట్టిపారేసింది. హిజాబ్ అనేది ఇస్లాంలో తప్పనిసరి అంశం కాదని కోర్టు పేర్కొంటూ విద్యాసంస్థలు నిర్దేశించిన యూనిఫామ్ ను మాత్రమే ధరించాలని సూచించింది.

Read Also : హైకోర్టు తీర్పు తరువాత కూడా ‘హిజాబ్‌’ టెన్షన్‌..పరీక్షలకు హాజరుకాని 40మంది విద్యార్ధినిలు