Karnataka Hijab Row : హైకోర్టు తీర్పు తరువాత కూడా ‘హిజాబ్‌’ టెన్షన్‌..పరీక్షలకు హాజరుకాని 40మంది విద్యార్ధినిలు

హైకోర్టు తీర్పు తరువాత కూడా కర్ణాటకలో ‘హిజాబ్‌’ టెన్షన్‌ పోలేదు. న్యాయస్థానం తీర్పు కంటే తమ సంప్రదాయమే ముఖ్యం అనుకున్న 40మంది విద్యార్ధినిలు పరీక్షలకు హాజరుకాలేదు.

Karnataka Hijab Row : హైకోర్టు తీర్పు తరువాత కూడా ‘హిజాబ్‌’ టెన్షన్‌..పరీక్షలకు హాజరుకాని 40మంది విద్యార్ధినిలు

Karnataka Hijab Row

Karnataka Hijab Row: ‘హిజాబ్’ విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కంటే మా సంప్రదాయమే ముఖ్యం’అన్నట్లుగా ఉంది కర్ణాటకలో ముస్లిం విద్యార్ధుల తీరు. హైకోర్టు తీర్పు ఇచ్చినా హిజాబ్ ధరించే పరీక్షలు రాయటానికి కూడా ఇష్టపడలేదు. దీంతో 40మంది విద్యార్ధినిలు పరీక్షలకు హాజరు కాలేదు. కర్ణాటక హైకోర్టు తీర్పుతో చల్లారింది అనుకున్న హిజాబ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. , ప్రీ యూనివర్సిటీ పరీక్షలతో మళ్లీ హైటెన్షన్‌ క్రియేట్ చేసింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలకు చెందిన 40మంది ముస్లిం విద్యార్థినిలు మంగళవారం (మార్చి 29,2022) జరిగిన మొదటి ప్రీ యూనివర్శిటీ పరీక్షలకు హాజరు కాలేదు. ఎందుకంటే హిజాబ్ ధరించకుండా పరీక్షలు రాయటానికి ఇష్టపడలేదు.

Also read :Hijab Row : ఇస్లాంలో హిజబ్ తప్పనిసరి కాదు.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు..!

హిజాబ్ విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, దానిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొందరు విద్యార్థినులు. విద్యాసంస్థల్లోని తరగతి గదుల్లో హిజాబ్ ధరించకూడదని ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చింది. ఈ తీర్పు కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన 40 మంది ముస్లిం విద్యార్థినులు మొదటి ప్రీ యూనివర్సిటీ పరీక్షకు హాజరుకాలేదు. మార్చి 15న జారీ చేసిన ఉత్తర్వుల వల్ల మనస్తాపానికి గురైన విద్యార్థులు, హిజాబ్ ధరించకుండా పరీక్షకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

వీరిలో కుందాపూర్‌కు చెందిన 24 మంది, బైందూరుకు చెందిన 14 మంది, ఉడిపి ప్రభుత్వ గర్ల్స్ పియు కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థినులు ఉన్నారు. వీరంతా క్లాస్ రూముల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై, న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ విద్యార్థినులు గతంలో ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరించారు. ఆర్‌ఎన్ శెట్టి పీయూ కళాశాలలో 28 మంది ముస్లిం విద్యార్థినుల్లో కేవలం 13 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మరికొందరు విద్యార్థులు హిజాబ్‌లు ధరించి పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పటికీ, వారికి అనుమతి లభించలేదు.

Hijab Row: సిక్కు మతానికి చెందిన ఆరేళ్ల బాలుడికి స్కూల్ అడ్మిషన్ నిరాకరణ

ఉడిపిలోని భండార్కర్ కళాశాలలో ఐదుగురు యువతుల్లో నలుగురు విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. అలాగే బస్రూర్ శారద కాలేజపీలో యువతులు అందరు పరీక్షలకు హాజరయ్యారు. నవుండ ప్రభుత్వ పియూ కాలేజీలో 8 మంది యువతుల్లో ఆరుగురు విద్యార్థులు పరీక్షలకు రాలేదు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులు హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించినా, ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం హిజాబ్ ధరించి రావటానికి అనుమతి ఇవ్వలేదు.

కాగా..ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణకు మార్చి 24న సుప్రీంకోర్టు నిరాకరించింది. హిజాబ్‌ ఇష్యూపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎదురు చూడాలని సదరు విద్యార్థినులు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.