Hijab Row: సిక్కు మతానికి చెందిన ఆరేళ్ల బాలుడికి స్కూల్ అడ్మిషన్ నిరాకరణ

ఇటీవల సిక్కు కమ్యూనిటీ కి చెందిన ఆరేళ్ల బాలుడు ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ కు వెళ్లి నిరాకరణకు గురయ్యాడు. సిక్కు మతానికి చెందిన తలపాగా ధరించడమే..

Hijab Row: సిక్కు మతానికి చెందిన ఆరేళ్ల బాలుడికి స్కూల్ అడ్మిషన్ నిరాకరణ

Hijab Row (1)

Hijab Row: కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైంది. హైకోర్టులో ఈ అంశంపై విచారణలో ఉండగా అడపాదడపా విద్యా సంస్థల్లో ఏదో ఒక అలజడి కనిపిస్తూనే ఉంది. ఇటీవల సిక్కు కమ్యూనిటీ కి చెందిన ఆరేళ్ల బాలుడు ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ కు వెళ్లి నిరాకరణకు గురయ్యాడు. సిక్కు మతానికి చెందిన తలపాగా ధరించడమే ఇందుకు కారణమని అక్కడి వారు చెబుతున్నారు.

మంగళూరులోని ప్రైవేట్ స్కూల్‌ను దీనిపై నివేదిక సమర్పించాలని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) సూచించింది. CWC ఛైర్మన్ డిసౌజా మాట్లాడుతూ.. సిక్కు మతానికి చెందిన విద్యార్థులు పట్కా లేదా కారా ( కంకణం, బ్రాస్‌లెట్) వంటివి ధరించవచ్చని అనుమతించారు.

‘క్లాసురూంలలో హిజాబ్ ధరించకూడదని కర్ణాటక హైకోర్టు సూచించిన సమయంలో స్కూల్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది’ అని డిసౌజా అన్నారు. బుధవారం జరిగిన విచారణలో స్టూడెంట్స్ స్కూల్స్, కాలేజీలు సూచించిన యూనిఫామ్ నే ధరించాలని కేసు విచారణ పూర్తయ్యేంత వరకూ ఇదే పాటించాలని సూచించింది.

Read Also: హిజాబ్ ను విద్యాసంస్థల బయటే ధరించండి

ఈ విషయంలో రాష్ట్రీయ సిక్ సంఘత్ జోక్యం చేసుకోవడంతో ఫిబ్రవరి 28న తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని స్కూల్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది.

ఈ సమయంలోనే సిక్కు మతానికి చెందిన ఓ యువతిని టర్బన్ తీసేయాలని చెప్పిందట కాలేజ్ మేనేజ్మెంట్. కోర్టు ఆదేశాలు వచ్చేవరకూ స్కూల్స్ లో ఎటువంటి మతపరమైన దుస్తులు ధరించకూడదని విద్యార్థులకు చెప్పినట్లు కాలేజీ అధికారులు చెబుతున్నారు.