kanpur school
kanpur school : చదువుకోవడానికి వచ్చిన చిన్నారులతో (children) చీపురు పట్టించారు. స్కూల్ మొత్తం తుడిపించారు. చదువులు నేర్పాల్సిన గురువులు ఇలాంటి పనులు చేయించడం పట్ల విద్యార్ధుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
kerala school new concept : కొత్త అడ్మిషన్ల కోసం కేరళ స్కూల్ కొత్త కాన్సెప్ట్ అదిరిందిగా..
పలకలు, పుస్తకాలు పట్టి చదువుకునేందుకు వచ్చిన విద్యార్ధులతో చీపురు పట్టిస్తున్నారు ఉత్తరప్రదేశ్‌లోని (uttar Pradesh) కాన్పూర్ జిల్లాలోని (kanpur) ఓ పాఠశాల ఉపాధ్యాయులు. ఇక్కడ స్కూలు సమయంలో కొందరు విద్యార్ధులు చీపురు పట్టి స్కూలు శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జనం ఉపాధ్యాయులపై మండిపడుతున్నారు. చదువు చెప్తారని పంపిస్తే ఇలాంటి పనులు చేయిస్తారా? అని నిలదీస్తున్నారు. అయితే ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక స్కూల్ యాజమాన్యం కూడా స్పందించాల్సి ఉంది.
తరచు విద్యార్ధులను తీవ్రంగా కొట్టి, హింసించిన టీచర్ల కథనాలు వింటున్నాం. తాజాగా పాఠశాలలో పిల్లలతో పనులు చేయిస్తున్న వీడియో ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో వైరల్ అవుతోంది. పిల్లలతో పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని అక్కడి జనం కోరుతున్నారు.