gang-raped at knifepoint : దేశ రాజధాని ఢిల్లీలో సమాజం తలదించుకొనే ఘటనలు వెలుగు చూసున్నాయి. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిత్యం కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బావను కొట్టి..అతని ఎదుటనే 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా..నగదును దోచుకుని పరారయ్యారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు గంట వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశారు.
మంగళవారం రాత్రి బంధువులను కలుసుకుని 17 ఏళ్ల బాలిక, ఆమె బావ ఇంటికి తిరిగి వస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో బస్సు దిగారు. Mandoli jail ప్రాంతానికి చేరుకున్న తర్వాత..ముగ్గురు 25 నుంచి 30 సంవత్సరాల వయస్సున్న యువకులు..వీరిని అడ్డుకున్నారు. బాలికను వేధించారు. ఇది సరికాదని వారు చెప్పినా వినిపించుకోలేదు.
అకస్మాత్తుగా కత్తులు బయటకు తీసి బెదిరించారు. సమీపంలో నిర్మాణమవుతున్న భవనంలోకి తీసుకెళ్లారు. అక్కడ బాలికపై అత్యాచారం చేశారు. దీనిని బావ అడ్డుకోవడంతో అతనిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం బాలిక వద్దనున్న పర్సును లాక్కొని ద్విచక్రవాహనంపై పారిపోయారు.
వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. ఘటనా ప్రాంతం నుంచి కొద్దిదూరంలో ఉన్నారని గమనించి..వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. కానీ వారు..ద్విచక్ర వాహనంపై పారిపోయేందుకు ప్రయత్నించారు.
https://10tv.in/minor-girl-raped-by-mother-colleagues/
మూడు కిలోమీటర్ల దూరం వెంబడించారు. చివరకు వాహనాన్ని పడేసి..వీధుల్లోకి పరుగెత్తారు. అనంతరం పోలీసుు సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఓ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి…అక్కడున్న స్థానికుల సహాయంతో నిందితులను పట్టుకున్నారు.
Shehzad, Rajeev, Ikram నిందితులుగా గుర్తించారు. బాలిక నుంచి లాక్కొన్న పర్సును స్వాధీనం చేసుకున్నారు. వారు ప్రయాణించిన ద్విచక్ర వాహనం చోరీ చేసిందని పోలీసులు తెలిపారు.