వారిని చూస్తే గర్వంగా ఉంది: తేజస్వీ యాదవ్

  • Publish Date - February 26, 2019 / 05:33 AM IST

బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బీహార్ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం చేసిన దాడిని ప్రశంశించారు. ట్విట్టర్ వేదికగా ధైర్యంగా పాకిస్తాన్ పై దాడి చేసిన పైలట్లకు సెల్యూట్ అంటూ వారిని అభినందించారు. భారత వైమానిక దళాలను చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు.