CM KCR inaugurates BRS party office: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ తాను అనుకున్నది సాధించటానికి ఢిల్లీలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని అత్యంత అట్టహాసంగా ప్రారంభించారు. యాగాలు,పూజలు చేసిన తరువాత సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జెండాను ఎగురవేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ అపూర్వ కార్యక్రమానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత,యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, పలువురు రాజకీయా నాయకులు,హర్యానా,పంజాబ్,యూపీ, బీహార్ కు చెందిన రైతు సంఘాల నాయకులు హాజరయ్యారు. కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యాక్రమానికి తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం కూడా హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Delhi | Bharat Rashtra Samithi's (BRS) office inaugurated today. Telangana CM K Chandrasekhar Rao, his daughter & MLC K Kavitha and other political leaders also participated in the ceremony. pic.twitter.com/IEC5rxz6q0
— ANI (@ANI) December 14, 2022
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కంటే ముందు.. సీఎం కేసీఆర్ దంపతులు రాజశ్యామల యాగం పూర్ణాహుతికి హాజరయ్యారు. కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే.