కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ విద్యార్థిని

  • Publish Date - January 26, 2020 / 12:46 AM IST

ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్వార్‌ గ్రామానికి చెందిన మీదింటి లక్ష్మి అధిరోహించింది. 2020, జనవరి 17న హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన లక్ష్మి కిలిమంజారో పర్వతాన్ని గురువారం అధిరోహించి ప్రతిభ కనబరిచింది. ఆమె మహబూబ్‌నగర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.