Telangana’s young woman elected as Miss India World-2020 : తెలంగాణ యువతి మిస్ ఇండియా వరల్డ్-2020 విజేతగా నిలిచారు. బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ ఇంజినీర్ మానస వారణాసి విజేతగా నిలిచారు. హరియాణా యువతి మానిక శికంద్ ను ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా విజేతగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మాన్యసింగ్ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్ గా నిలిచారు.
జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటులు నేహాధూపియా, చిత్రాంగద సింగ్, పులకిత్ సమ్రాట్, ప్రముఖ డిజైనర్ ఫల్గుణి వ్యవహరించారు.