Corona Second Wave: కోటి మంది ఉద్యోగాలు కోల్పోయారు.. ఆదాయం తగ్గింది!

కరోనా సెకండ్ వేవ్ కంటి మీద కునుకులేకుండా చెయ్యగా.. వైరస్ దెబ్బకు దేశంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కరోనా సెకండ్ వేవ్ భయపెట్టడమే కాదు.. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పెడుతోంది.

One Crore Jobs Lost: కరోనా సెకండ్ వేవ్ కంటి మీద కునుకులేకుండా చెయ్యగా.. వైరస్ దెబ్బకు దేశంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కరోనా సెకండ్ వేవ్ భయపెట్టడమే కాదు.. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పెడుతోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేష్ వ్యాస్ లెక్కల ప్రకారం కరోనా సెకండ్ వేవ్‌లో కోటి మంది తమ ఉద్యోగాలు కోల్పోయారని, 97శాతం మంది ఇళ్లలో ఆదాయం తగ్గిందని, వ్యయం పెరిగిందని వెల్లడించారు.

ఏప్రిల్ నెలలో 8 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఇప్పుడు మే నెలలో 12 శాతానికి పెరిగిందని, ఉద్యోగాలు కోల్పోయినవారికి కొత్త ఉద్యోగాలు దొరకడం కష్టమయ్యిందని మహేష్ వ్యాస్ అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఉద్యోగాలు కోల్పోయే వ్యక్తులు ఉపాధి పొందడం కష్టమని, నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు తిరిగిరావడానికి ఒక సంవత్సరం పట్టవచ్చునని అభిప్రాయపడ్డారు.

లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు, వ్యాపార కార్యకాలాపాలు ప్రారంభించిన తర్వాత.. ఆర్థిక పరిస్థతి బాగుపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు వ్యాస్. గత ఏడాదికాలంలో ఆదాయాల తీరుపై 1.75 లక్షల గృహాలపై సీఎంఐఈ చేసిన సర్వేలో ఈ విషయం తెలిసినట్లుగా వ్యాస్ చెప్పారు. ఇదే సమయంలో 3 శాతం మంది ఆదాయం మాత్రమే పెరిగిందని, 55 శాతం మంది కరోనా కారణంగా ప్రభావితం అయ్యారని చెప్పారు. ఇక 42 శాతం మంది ఆదాయం స్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు