చైనాకు మరో షాక్.. వందే భారత్ రైళ్ల టెండర్ రద్దు చేసిన రైల్వేశాఖ!

  • Publish Date - August 22, 2020 / 08:11 AM IST

చైనాతో ఇప్పటికే అన్నీ విషయాల్లో తెగదెంపులు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న భారత్.. వరుసగా దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే చైనా యాప్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ‘వందే భారత్ రైళ్లు’ రైళ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ను భారత్ రద్దు చేసింది. వారంలోపు కొత్త టెండర్ జారీ చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

మొత్తం 44 సెట్ల సెమీ-హైస్పీడ్ రైళ్ల తయారీకి రైల్వే శాఖ టెండర్లను పిలవగా అప్పుడు చైనా సంస్థ దీనిని దక్కించుకుంది. అనూహ్యంగా వీటిని రద్దు చేసిన రైల్వే శాఖ.. మార్గదర్శకాలను సమీక్షించి వారం రోజుల్లో కొత్తగా టెండర్లకు బిడ్‌ను ఆహ్వానించనున్నట్టు వెల్లడించింది. 2015 సంవత్సరంలో, చైనా కంపెనీ సిఆర్ఆర్సి యోంగ్జీ ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్ మరియు గురుగ్రామ్ పయనీర్ ఎలక్ట్రిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఈ జాయింట్ వెంచర్ ఏర్పడింది.

కొత్త టెండర్లలో స్థానిక కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ.. క్లాస్ -1,2, నాన్-లోకల్ కేటగీరిని ప్రవేశపెట్టి, దీని ఆధారంగా స్థానికులకు ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాధాన్యత ఇస్తారు. క్లాస్ -1లో స్థానిక సరఫరాదారులు అన్ని ప్రభుత్వ కొనుగోళ్లలో ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే వారి దేశీయ విలువ అదనంగా 50% లేదా అంతకంటే ఎక్కువ. తర్వాతి స్థానంలో క్లాస్ -2 సరఫరాదారులు ఉంటారు. దీని విలువ 20నుంచి 50 శాతం మధ్య ఉంటుంది.

మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా వందే భారత్ రైళ్ల తయారీకి ముందుకొచ్చిన కేంద్రం.. మొత్తం 44 జతల రైళ్లను . ఈ ప్రాజెక్టులో భాగంగా, కేంద్రంతో సంయుక్త వెంచర్‌ను కుదుర్చుకోవడానికి బిడ్లు వేసిన ఏకైక విదేశీ సంస్థగా చైనాకు చెందిన సీఆర్‌ఆర్‌సీ కార్పొరేషన్‌ నిలిచింది. వాస్తవానికి, చైనా కంపెనీ జాయింట్ వెంచర్ సీఆర్‌ఆర్‌సీ పయనీర్ ఎలక్ట్రిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ (సీఆర్‌ఆర్‌సీ పయనీర్ ఎలక్ట్రిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్) టెండర్ అందుకున్న ఏకైక విదేశీ సంస్థ. ఇది కాకుండా, ఇంకా 5 కంపెనీలు కూడా ఈ సెమీ హైస్పీడ్ రైళ్ళలో 44 సెట్లను సిద్ధం చేయడానికి టెండర్ వేశాయి.