Thanjavur : ఎన్నికల ప్రచారంలో డీఎంకే అభ్యర్థిని అనసూయకు గుండెపోటు

తంజావూరులో అయ్యంపేటై 9వ వార్డుకు డీఎంకే పార్టీ తరపున అభ్యర్థిగా డీఎం అనసూయ బరిలో నిలిచారు. గురువారం ఆమె తంజావూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో...

Tamilnadu

Thanjavur Candidate Dies : తమిళనాడు రాష్ట్రంలో త్వరలో పట్టణ స్థానిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో పలు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీ బిజీగా మారిపోయారు. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 19వ తేదీన జరుగబోయే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ డీఎంకే తరపున పలువురు బరిలో నిల్చొన్నారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో విషాదం నెలకొంది. డీఎంకే పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన మహిళా అభ్యర్థి అనసూయ హఠాన్మరణం జరిగింది. దీంతో ఆ పార్టీకి సంబంధించిన నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Read More : Bihar : ఇసుక వేలంలో ఘర్షణ..మహిళలకు సంకెళ్లు వేసి నేలపై కూర్చొబెట్టిన పోలీసులు

తంజావూరులో అయ్యంపేటై 9వ వార్డుకు డీఎంకే పార్టీ తరపున అభ్యర్థిగా డీఎం అనసూయ బరిలో నిలిచారు. గురువారం ఆమె తంజావూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటు వచ్చింది. కుప్పకూలడంతో అక్కడున్న పార్టీ నేతలు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ.. అనసూయ అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంకే నేతలు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. అనసూయ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీన జరిగే ఈ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగియనుంది. ఫిబ్రవరి 22న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.