BS Yeddyurappa
BS Yeddyurappa : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే అప్రమత్తమైన పైలెట్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ సమయంలో విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొనేందుకు యడియూరప్ప వెళ్తుండగా కలుబురగిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ దిగాల్సిన హెలిప్యాడ్ గ్రౌండ్ లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్ధాలు ఉండటంతో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తాయి.
BS Yediyurappa: తిరిగి తిరిగి మళ్లీ యడియూరప్ప వెనకకే వస్తున్న బీజేపీ
పైలెట్ చివరి నిమిషంలో చాకచక్యంగా వ్యవహరించాడు. హెలికాప్టర్ ను ల్యాండ్ చేయకుండా ముందుకు తీసుకెళ్లాడు. అనంతరం అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో కిందకు దించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.