Madhya Pradesh
Madhya Pradesh : ఇండోర్ కి చెందిన ఓ లాయర్ ‘సంవిధాన్ సే దేశ్’ అనే పుస్తకాన్ని అందరి ముందుకు తీసుకువచ్చారు. క్రౌండ్ ఫండింగ్ ద్వారా రూపొందించిన ఈ పుస్తకంకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
Hyderabad: తెలుగులో తొలి ఫ్యాక్ట్ చెకింగ్ పుస్తకం ఆవిష్కరణ
ఇండోర్‌కి చెందిన లోకేష్ మంగల్ అనే లాయర్ ‘సంవిధాన్ సే దేశ్’ అనే పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని తయారు చేయడానికి 57 కిలోల రాగి ప్లేట్లను ఉపయోగించారు. పూర్వకాలం వీటిని తామ్రపత్రాలు అని కూడా పిలిచేవారు. ఇందులో 193 దేశాలకు చెందిన 6,000 చిహ్నాలు ముద్రించారట. ఈ చిహ్నాలను లేజర్ సాంకేతికతతో ఇద్దరు ఆర్టిస్ట్ లు రాగి పలకలపై చెక్కారట. వీరికి మొత్తంగా 217 గంటలు పట్టిందట. ఆరేళ్లపాటు కష్టపడి ఈ పుస్తకాన్ని తయారు చేసినట్లు లోకేష్ మంగళ్ చెప్పారు.
United States : అద్దెకు ఇచ్చిన పుస్తకం 96 సంవత్సరాలకి లైబ్రరీకి తిరిగి వచ్చింది
‘సంవిధాన్ సే దేశ్’ పుస్తకం తీసుకురావడానికి లోకేష్ ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. 42,000 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.1 విరాళం తీసుకున్నారు. కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రేరణతో ఈ పుస్తకం ముద్రించినట్లు లోకేష్ చెప్పారు. ప్రపంచమంతా ఒక కుటుంబం అని చెప్పడమే ఈ పుస్తకం తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. 57 కిలోల బరువున్న ఈ పుస్తకాన్ని తరలించాలంటే కనీసం ఇద్దరు వ్యక్తులు కావాలి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ పుస్తకం జీ20 సమ్మిట్ జరుగుతున్న తరుణంలో తీసుకురావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని లోకేష్ మంగళ్ చెబుతున్నారు.