Rajya Sabha : రాజ్యసభలో జరిగిన గొడవ దృశ్యాలను బయటపెట్టిన కేంద్రం

సభా వ్యవహారాలపై విపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. రాజ్యసభలో జరిగిన గొడవ దృశ్యాలను కేంద్రం బయట పెట్టింది.

Rajysabha

central government : సభా వ్యవహారాలపై విపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. రాజ్యసభలో జరిగిన గొడవ దృశ్యాలను కేంద్రం బయట పెట్టింది. ఎంపీలకు, మార్షల్స్ కు మధ్య తోపులాట జరిగింది. లేడీ మార్షల్ ను ప్రతిపక్ష మహిళా ఎంపీలు చుట్టు ముట్టారు.

నిన్న బయటి వ్యక్తులతో మహిళా ఎంపీలపై దాడి చేయించారని ప్రతిపక్షాలు ఆరోపించారు. మహిళా ఎంపీలపై భౌతిక దాడి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న భావన కల్గిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.

అయితే ప్రతిపక్షాల ఆరోపణలను త్రోసిపుచ్చిన ప్రభుత్వం వీడియో విడుదల చేసింది. మరోవైపు రాజ్యసభలో దాడిని నిరసిస్తూ విపక్షాలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించాయి. పెగాసస్ పై పార్లమెంట్ లో చర్చ జరుగకుండా సభా అర్ధాంతరంగా వాయిదా వేయడాన్ని తప్పుబట్టాయి.

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. మార్చ్ అనంతరం విపక్ష నేతలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు.