MP Sanjay Raut : శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు మరోసారి ఈడీ సమన్లు

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. మనీలాండరింగ్‌లో రౌత్‌ బుధవారం(జులై20,2022) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో విచారణకు రాలేనని రౌత్ స్పష్టం చేశారు.

MP Sanjay Raut : శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. మనీలాండరింగ్‌లో రౌత్‌ బుధవారం(జులై20,2022) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో విచారణకు రాలేనని రౌత్ స్పష్టం చేశారు.

ఈ మేరకు సంజయ్ రౌత్‌ తరఫున లాయర్లు ముంబైలో ఈడీ అధికారులను కలిసి సమన్లకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆగస్టు మొదటి వరకు సమయం ఇవ్వాలని కోరారు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతున్న క్రమంలో విచారణకు రాలేదని న్యాయవాదులు ముంబై జోనల్‌ కార్యాలయంలో అధికారులను కలిసి వివరించారు.

CJI Justice NV Ramana : ‘మహారాష్ట్ర’ వివాదంపై సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

ఈ మేరకు ఎంపీ సంజయ్ రౌత్ కు వారం గడువు ఇస్తున్నట్లు.. ఈ నెల 27న విచారణకు రావాలని ఈడీ స్పష్టం చేసింది. అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కక్షలతోనే తనను టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపించారు. మనీలాండరింగ్‌ కేసులో రౌత్ ను ఈ నెల 1న ఈడీ విచారించింది.

పీఎంఎల్‌ఏ చట్టం కింద 10 గంటల పాటు ఈడీ ఆయన్ను ప్రశ్నించింది. ముంబైలోని గోరెగావ్‌ పాత్రచాల్‌ భూకుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో మనీలాండరింగ్‌ కేసులో సంజయ్‌ రౌత్‌ భార్యతో పాటు స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు