Farmers In Delhi : తగ్గేదే లే.. కేసులు ఉపసంహరించుకునే వరకు ఉద్యమిస్తామన్న రైతులు

బోర్డర్‌లో తగ్గేదేలేదంటున్నాయి రైతు సంఘాలు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన సమయంలో.. తమపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఉద్యమం తప్పదని తేల్చిచెప్పేస్తున్నారు.

The farmers movement in Delhi : బోర్డర్‌లో తగ్గేదేలేదంటున్నాయి రైతు సంఘాలు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన సమయంలో.. తమపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఉద్యమం తప్పదని తేల్చిచెప్పేస్తున్నారు. రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోకపోతే.. ఢిల్లీ సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లేది లేదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.

ఇక కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు రైతులు సిద్ధమయ్యారు. ఐదుగురు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా ఏర్పాటు చేసింది. కనీస మద్దతు ధరపై కేంద్రంతో ఈ బృందం చర్చలు జరపనుంది. రాకేశ్‌ టికాయత్‌తో పాటు గుర్నామ్‌సింగ్‌, బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌, అశోక్‌ ధావ్లే, శివకుమార్‌, యుద్‌వీర్‌సింగ్‌‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సాగుచట్టాల రద్దు రైతుల విజయమని భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేశ్ టికాయత్ అన్నారు.

Aayushman Bharat Scheme : ఆర్మీకి కూడా ఆయుష్మాన్ భారత్ పతకం వర్తింపు

కమిటీని ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరిగిందన్న విమర్శలను ఆయన తప్పుపట్టారు. కేంద్రమే మూడు సాగు చట్టాల రద్దును ఆలస్యం చేసిందని విమర్శించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చర్చలకు రావాలని తమను ఆహ్వానించారని టికాయత్‌ చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు విజయంతమైతేనే ఉద్యమాన్ని ఆపేస్తామని స్పష్టం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా తదుపరి సమావేశం ఎల్లుండి జరుగనుంది.

భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా కీలక సమావేశం నిర్వహించింది. పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని.. రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, నిరసనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు