Kerala : శబరిమల యాత్రకు భక్తుల అనుమతిపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం

కేరళ శబరిమల యాత్రకు భక్తుల అనుమతిపై విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మండల-మకరవిళక్కు సందర్భంగా రోజుకు 25 వేల మందిని మాత్రమే అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు.

Kerala (4)

Kerala government key decision : కేరళ శబరిమల యాత్రకు భక్తుల అనుమతిపై విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మండల-మకరవిళక్కు సందర్భంగా రోజుకు 25 వేల మందిని మాత్రమే అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు. వచ్చే నెల 16 నుంచి ప్రారంభమయ్యే యాత్రకు చేయవలసిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తుల సంఖ్యను సవరించవలసి వస్తే, చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు విజయన్.

శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. 25 వేల మందికి ప్రత్యక్ష దర్శనంతోపాటు…వర్చువల్ క్యూ సిస్టమ్ కొనసాగుతుందన్నారు. పదేళ్ళ లోపు, 65 ఏళ్లు పైబడిన వయసుగలవారిని కూడా శబరిమల దేవాలయంలోకి అనుమతించనున్నారు. దర్శనానికి వచ్చేవారు కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని ఉండాలని, లేదా…నెగెటివ్ ఆర్‌టీపీసీఆర్ రిపోర్టు చూపించాలన్నారు.

Military Colleges : మిలటరీ కాలేజీల్లో బాలికలకు అడ్మిషన్లు

అయ్యప్పను దర్శనం తర్వాత సన్నిధానం వద్ద ఉండటానికి అనుమతి లేదన్నారు కేరళ సీఎం. ఎరుమేలి, పులిమేడు అటవీ మార్గాల ద్వారా ఈ ఏడాది కూడా భక్తులను అనుమతించబోతమని స్పష్టం చేశారు. వాహనాల్లో నీలక్కల్ వరకు వచ్చి….అక్కడి నుంచి పంపా నదికి కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది…