West Bengal : చంపిన దోమల్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు

దోమల బెడద ఎక్కువై వైరల్ ఫీవర్లు, డెంగీ ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి చేసిన వినూత్న నిరసన చర్చనీయాంశంగా మారింది.

West Bengal

West Bengal : ఇటీవల కాలంలో డెంగీ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. మురికినీటి కుంటలు, అపరిశుభ్ర వాతావరణం అందుకు కారణం. ఇలాంటి సమస్యలు ఎదురైనపుడు ఎవరైనా స్ధానిక లీడర్లకు తమ సమస్యను చెప్పుకుంటారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన ఓ వ్యక్తి వినూత్న నిరసన చేసాడు. అదేంటో చదివితే ఆశ్చర్యపోతారు.

Dengue Fever : జ్వరం తగ్గిన తరువాతే డెంగీ బయటపడుతుందట.. బీ అలర్ట్

మంగల్ కోట్ ఖుర్తుబా గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉంది. ఇలాంటి సమస్య ఎదురైతే ఎవరైనా స్ధానిక నేతలకు కంప్లైంట్ చేస్తారు. కానీ మన్సూర్ అలీ అనే వ్యక్తి వినూత్నంగా తన నిరసన తెలిపాడు. తనను కుట్టిన దోమల్నిచంపి ఒక కవర్లో పట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తనకు డెంగీ వచ్చిందో లేదో చెక్ చేసి చెప్పాలని భీష్మించుకుని కూర్చున్నాడు. అతని తీరుకి వైద్యులంతా నోరెళ్లబెట్టారు.

వ్యాధులను వ్యాప్తి చేస్తున్న దోమలు ! దోమల బెడద నుండి రక్షించుకునేందుకు చిట్కాలు

వ్యాపారం చేసుకుని జీవించే మన్సూర్ అలీ దుకాణానికి సమీపంలో నీటి కుంటలు ఉండటంతో దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. అక్కడి సమస్యను పట్టించుకునే వారు లేకుండా పోయారు. దీంతో అతను ఇలా తన నిరసన తెలిపాడు. దోమల్ని పరీక్షించి తనకు డెంగీ వచ్చిందో లేదో చెప్పాలని డాక్టర్లని పట్టుబట్టాడు. చేసేది లేక డాక్టర్లు పంచాయతీ అధికారులు చెప్పారు. వారు దోమల బెడద పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మన్సూర్ అలీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం మన్సూర్ అలీ హాట్ టాపిక్‌గా మారాడు.

ట్రెండింగ్ వార్తలు