Bengaluru Mystery Loud
Bangalore Mystery Sound : కర్ణాటక రాజధాని బెంగుళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో నగరవాసులు భయపడ్డారు. మధ్యాహ్నం గం.12-30 సమయంలో హెచ్‌ఎస్ఆర్ లే అవుట్, మహదేవపుర, సిల్క్‌బోర్డ్, మడివాల, బొమ్మనహళ్లి, కొత్తనూరు, అగర, హుళిమావు, అనేకల్, పద్మానభ నగర్ వంటి పలు ప్రాంతాల్లో ఈ శబ్దం వినిపించింది.
ఈ శబ్దాల ధాటికి పలు ఇళ్లలో కిటీకీల అద్దాలు పగిలిపోయాయి. ఈశబ్దానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. కాగా… ఈ శబ్దం గతేడాది వచ్చిని సోనిక్ బూమ్‌ను గుర్తుచేసిందని కొందరు తెలిపారు. 2020 మేలో కూడా బెంగుళూరులో భారీ శబ్దాలు వినిపించాయి. ఇది మరోక సోనిక్ బూమ్ అని బెంగుళూరువాసులు అనుకుంటున్నారు. కొందరు ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
మరి కొందరు నెటిజన్ల అభిప్రాయం ప్రకారం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విమానాశ్రయం నుంచి శిక్షణ యుద్ధ విమానాలు ఆకాశంలో ప్రయాణించటంతో ఈ శబ్దాలు వినిపించినట్లు కొందరు భావించారు. అయితే శుక్రవారం వినిపించిన శబ్దాల గురించి స్పందించడానికి హెచ్ఏఎల్ అధికారులు నిరాకరించారు.
యుద్ధ విమానాలు, శిక్షణ విమానాలు ప్రతి రోజూ ప్రయాణిస్తూ ఉంటాయని, ఈరోజు ప్రత్యేకంగా ఏమీ జరగలేదని హెచ్ఏఎల్ అధికార ప్రతినిధి ఓ వార్తా సంస్థకు తెలిపారు. బెంగళూరులో ఈరోజు వినిపించినట్లు చెప్తున్న శబ్దాలపై వ్యాఖ్యానించటానికి హెచ్ఏఎల్ అధికారులు నిరాకరించారు.