Pm Modi
PM Modi : దేశవ్యాప్తంగా అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. అగ్నిపథ్ పథకం గురించి ప్రధానికి వివరించారు. అగ్నిపథ్ ప్రకటించిన తరువాత తొలిసారి మోడీతో త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. అగ్నిపథ్ పై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం, త్రివిధ దళాలు స్పష్టం చేశాయి.
అయితే అగ్నిపథ్ రద్దు చేయాలని..పాత రిక్రూట్ మెంట్ పాలసీ అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిచారు. అగ్నిపథ్ ను సాయుధ దళాల రిక్రూట్‌మెంట్ పాలసీ లో సంస్కరణగా కేంద్రం పేర్కొంది.
Agnipath: అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తేలేదు: అజిత్ డోభాల్
దేశానికి సేవ చేయడానికి, దేశ నిర్మాణానికి సహకరించడానికి యువతకు ఒక ప్రత్యేక అవకాశమని తెలిపింది. ఈ పథకం కింద యువత నాలుగు సంవత్సరాల పాటు ఆకర్షణీయమైన వేతనంతో సాయుధ దళాలలో సేవ చేసేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. అగ్నివీర్లకు అత్యుత్తమ శిక్షణతో పాటు వారి నైపుణ్యాన్ని అర్హతలను పెంచే పథకంగా అగ్నిపథ్ ను పేర్కొంటోంది.