Vaccination Of Children : సరైన శిక్షణ పొందిన వారితో మాత్రమే పిల్లలకు కోవిడ్ టీకాలు వేయించాలి : కేంద్ర ఆరోగ్యశాఖ

దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే జనవరి3, 2022 నుంచి 15-18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

Union Ministry of Health suggestions : దేశంలో 18 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కూడా ఇక నుంచి కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్ పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని తెలిపింది. సరైన శిక్షణ పొందిన వారితో మాత్రమే పిల్లలకు కోవిడ్ టీకాలు వేయించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన చూసింది. వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది.

దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే జనవరి3,2022 నుంచి దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నారు. ఈ వ్యాక్సిన్ పొందేందుకు..అర్హులైనవారు జనవరి-1 నుంచే కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవచ్చని కోవిన్ ఫ్లాట్ ఫాం చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు.

Delhi Yellow Alert : ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు కఠినతరం.. ఎల్లో అలర్ట్.. వేటికి అనుమతి? వేటికి లేదంటే?

రిజిస్ట్రేషన్ కోసం అదనపు ఐడీ కార్డు- స్టూడెంట్ ఐడీ కార్డు(10వ తరగతి సర్టిఫికెట్)ను కూడా యాప్ లో చేర్చినట్లు తెలిపారు. కొందరు పిల్లలకు ఆధార్ కార్డు లేదా ఇతర ఐడీ కార్డులు లేకుండా ఉండే అవకాశముందని, కాబట్టి వాళ్లు తమ స్టూడెంట్ ఐడీ ద్వారా వ్యాక్సిన్ కోసం కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని ఆర్ఎస్ శర్మ తెలిపారు.

కోవిడ్ కొత్త వేరియంట్ ప్రపంచాన్ని కలవర పెడుతున్న సమయంలో 12-18 ఏళ్ల పిల్లలకు అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్ ఇచ్చేందుకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్(BBV152)కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI)శనివారం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Covid Vaccine : వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి..ఆధార్ లేదా స్కూల్ ఐడీ కార్డు కంపల్సరీ

దీంతో దేశంలో పిల్లల కోసం వినియోగించే కోవిడ్ వ్యాక్సిన్ కు ఆమోదం పొందిన రెండో సంస్థగా భారత్ బయోటెక్ నిలిచింది. అంతకుముందు 12 ఏళ్లు పైబడినవారందరికీ జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన మూడు డోసుల డీఎన్ఏ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి లభించిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు