భారత్‌లో మరో రెండు కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌లు

two new types of corona strains in India : భారత్‌లోకి మరో రెండు కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌లు వచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లోని స్ట్రెయిన్‌ దేశంలోకి ప్రవేశించింది.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నలుగురిలో ఆ దేశంలో ప్రభలుతున్న వైరస్ లక్షణాలు వెలుగు చూశాయని చెప్పింది. ఇటు బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక్కరిలో ఆ దేశంలో విస్తరిస్తున్న వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్నాయని చెప్పింది.

మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో ట్రేస్ చేశామని తెలిపారు. అందరిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇటు భారత్‌లో యూకే రకం వైరస్ కేసుల సంఖ్య 187కి చేరింది.