Mamata Banerjee: తృణమూల్ కార్యకర్తతో స్వీట్ వార్

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తతో ఒక స్వీట్ వార్ కు దిగారు. కార్యకర్త బరువు తగ్గించుకోవాలని సమస్యలు వస్తాయని చెబుతూనే, ఏం తింటున్నావ్.. ఏమేం చేస్తావనే ప్రశ్నలు వేస్తూ కాసేపు అతణ్ని వాదించి, చిన్న ఛాలెంజ్ కూడా విసిరారు.

Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తతో ఒక స్వీట్ వార్ కు దిగారు. కార్యకర్త బరువు తగ్గించుకోవాలని సమస్యలు వస్తాయని చెబుతూనే, ఏం తింటున్నావ్.. ఏమేం చేస్తావనే ప్రశ్నలు వేస్తూ కాసేపు అతణ్ని వాదించి, చిన్న ఛాలెంజ్ కూడా విసిరారు.

తమ అభిమాన నాయకురాలిని కలిసిన సందర్భంలో మాట్లాడుతున్న కార్యకర్తను అడ్డుకున్న మమతా.. “మీ పొట్ట అలా పెంచుతున్నారు. ఏదో ఒక రోజు జబ్బు పడటం ఖాయం. మీరు ఆరోగ్యంగానే ఉన్నారా..” అని అడిగారు.

కాస్త సిగ్గుపడిన ఆ వర్కర్… షుగర్, బీపీ లాంటివేమీ రాలేదని చెప్తూ.. తాను ఫిట్ గా ఉన్నానని అన్నాడు. ఆ తర్వాత రెగ్యూలర్ గా వర్కౌట్ చేస్తానని ఫిట్ గా ఉంటానని నమ్మించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

“ఇది కచ్చితంగా పెద్ద సమస్యే. మీరు ఈ పొట్టను మధ్యప్రదేశ్ లా ఎలా పెంచుతున్నారు. మీరు వాకింగ్ చేస్తారా.. ప్రతిరోజూ.. బాగా తింటారా” అని అడిగారు మమతా.

Read Also: 2024లో మమతా ప్రధాని, అభిషేక్ సీఎం అంటోన్న టీఎంసీ ఎంపీ

దానికి బదులిచ్చిన వర్కర్.. ప్రతిరోజూ ఉదయం పకోడీ తినడం నాకు అలవాటు అని సమాధానమిచ్చాడు.

పకోడి ఎందుకు తింటున్నావ్ రోజూ.. అలా అయితే నువ్వెప్పటకీ బరువు తగ్గవని బెనర్జీ సూచించారు. తాను రోజుకు మూడు గంటల పాటు ఎక్సర్‌సైజ్ చేస్తున్నానని, రోజూ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ కూడా చేస్తానని చెప్పేసరికి.. అలా చేస్తావా.. అయితే ఇప్పటికిప్పుడు ఒక వెయ్యి బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తే నీకు రూ.10వేలు ఇస్తానంటూ సవాల్ విసిరారు.

 


 

అలా జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతుంది.

ట్రెండింగ్ వార్తలు