×
Ad

Corona India : భారత్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు

దేశంలో ఇప్పటి వరకు 3,55,28,004 కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 4,83,790 మంది మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 41,434 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

  • Published On : January 9, 2022 / 10:41 AM IST

India (1)

new corona cases in India : భారత్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో మరోసారి కోవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 1,59,632 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 327 మంది మృతి చెందారు.  నిన్నటితో పోలిస్తే 12 శాతం కోవిడ్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,90,611 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

దేశంలో ఇప్పటి వరకు 3,55,28,004 కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 4,83,790 మంది మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 41,434 కరోనా కేసులు నమోదు అయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో 18,802, ఢిల్లీలో 20,181, తమిళనాడులో 10,978, కర్ణాటకలో 8906 కేసులు, కేరళలో 5944 నమోదు అయ్యాయి.

Vanama Raghava Remand : రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసు.. వనమా రాఘవకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

భారత్ లో 359 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 151.57 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. నిన్న 89,28,316 డోసుల టీకాలు అందజేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 151,57,60,645 డోసుల టీకాలు అందజేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించారు.