Vanama Raghava Remand : రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసు.. వనమా రాఘవకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న తర్వాత వనమా రాఘవ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తప్పించుకు తిరుగుతున్న రాఘవేంద్రను దమ్మపేట మండలం మందలపల్లి దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు.

Vanama Raghava Remand : రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసు.. వనమా రాఘవకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

Vanama

Ramakrishna family suicide case : తెలంగాణలో సంచలనం రేపిన రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో.. నిందితుడు వనమా రాఘవ ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. అతడికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో.. పోలీసులు భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు. వనమా రాఘవ.. రామకృష్ణను బెదిరించినట్లు పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి.

అతని కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు తానే కారణమని.. రాఘవ ఒప్పుకున్నాడన్నారు పోలీసులు. రామకృష్ణ బావమరిది జనార్దన్ ఫిర్యాదుతో.. పాల్వంచ పీఎస్‌లో కేసు నమోదైంది. అతనిపై.. 302, 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్‌రాజ్ . రాఘవపై.. మొత్తం 12 కేసులున్నట్లు తెలిపారు.

Heavy Rains : ఉత్తరాదికి వర్ష ముప్పు.. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వానలు

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న తర్వాత.. వనమా రాఘవ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొన్నాళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న రాఘవేంద్రను.. దమ్మపేట మండలం మందలపల్లి దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో.. అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక రాఘవతో పాటు ఇద్దరు యూత్ కాంగ్రెస్ నేతలు, ఓ వ్యాపారిని కూడా పోలీసులు విచారించారు.

గతంలో.. రాఘవేంద్రపై నమోదైన కేసులపైనా.. పోలీసులు విచారించనున్నారు. రాఘవ అరెస్టుతో ఇంతకముందు అతని వేధింపులకు గురైన వాళ్లు కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. రాఘవేంద్రపై ఫిర్యాదు చేస్తున్నారు. ఈ కేసును.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని డిమాండ్‌ చేస్తున్నారు.