Heavy Rains : ఉత్తరాదికి వర్ష ముప్పు.. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వానలు

వర్షాలు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. జమ్ముకశ్మీర్, లడక్‌, హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యాణా,రాజస్థాన్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లకు వర్షముప్పు ఉంది.

Heavy Rains : ఉత్తరాదికి వర్ష ముప్పు.. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వానలు

Rains

12 states and union territories : ఉత్తరాదికి వర్షముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మరో రెండు రోజుల పాటు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే దేశరాజధాని ఢిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో చాణక్యపురి, తూర్పు ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అండర్‌ పాస్‌లన్ని నీటితో మునిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంది.

CM KCR : కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌, సీపీఎం నేతలతో సీఎం కేసీఆర్ భేటీ

వర్షాలు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు.. జమ్ముకశ్మీర్, లడక్‌, హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యాణా,రాజస్థాన్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లకు వర్షముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

ఇప్పటికే హిమాచల్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.. వర్షాల నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు.. మళ్లీ కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.