CM KCR : కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌, సీపీఎం నేతలతో సీఎం కేసీఆర్ భేటీ

కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ సహా.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, బృందాకారత్‌, మిజోరాం మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ కూడా కేసీఆర్‌ లంచ్‌కు హాజరయ్యారు.

CM KCR : కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌, సీపీఎం నేతలతో సీఎం కేసీఆర్ భేటీ

Kcr

CM KCR meets Kerala CM Pinarayi Vijayan : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వామపక్ష నేతలను నిన్న లంచ్‌ మీటింగ్‌కు ఆహ్వానించి చర్చలు జరపడం హాట్ టాపిక్‌గా మారింది. కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ సహా.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, బృందాకారత్‌, మిజోరాం మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ కూడా కేసీఆర్‌ లంచ్‌కు హాజరయ్యారు. భవిష్యత్తు రాజకీయాలు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. సీపీఐ నేతలతోనూ సీఎం భేటీ అవడం ఆసక్తిని కలిగిస్తోంది.

తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. టీఆర్‌ఎస్‌- బీజేపీ నువ్వా నేనా అన్నట్లు రాజకీయ చదరంగంలో సవాల్‌ విసురుకుంటున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు కళ్లెం వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. దేశ వ్యాప్తంగా బీజేపీని దెబ్బకొట్టేందుకు సీఎం కేసీఆర్‌ వ్యూహాలు పన్నుతున్నారు. సీపీఎం జాతీయ నేతలతో.. కేసీఆర్ సమావేశం కావడమే ఇందుకు బలం చేకూర్చుతోంది.

IT Raids : మధ్యప్రదేశ్‌లో ఐటీ దాడులు.. అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ ట్యాంకులో దాచిన రూ.8కోట్లు, నగలు సీజ్

హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం జాతీయ కమిటీ సమావేశాలు.. పొలిటికల్‌గా కొత్త ఈక్వేషన్స్‌కి దారివేశాయి. పార్టీ జాతీయ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన.. సీపీఎం జాతీయ నేతలు, కేరళ సీఎం పినరయి విజయన్‌తో.. ముఖ్యమంత్రి కేసీఆర్ లంచ్ మీట్‌ పెట్టడం.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు.. అవసరమైన ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రాబోయే ఎన్నికల నాటికి.. టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు పొడవడం ఖాయమన్న చర్చ మొదలైంది.

మరోవైపు ఇటు బీజేపీ కూడా టీఆర్‌ఎస్‌పై దూకుడు కొనసాగిస్తోంది. జీవో నెంబర్‌ 317ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు పెంచుతోంది. ఇప్పటికే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్‌, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలంగాణలో పర్యటించి టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించగా.. ఇవాళ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ రాష్ట్రానికి రానున్నారు. హన్మకొండలో బీజేపీ నిర్వహించనున్న సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.