8దేశాల్లో మాత్రమే…బీజేపీ సభ్యుల కన్నా ఎక్కువ జనాభా

భారతీయ జనతా పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య కన్నా ఎక్కువ జనాభా ప్రపంచంలో ఎనిమిది దేశాల్లో మాత్రమే ఉందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ లో బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం హోంమంత్రి అమిత్ షా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

నూతన అధ్యక్ష బాధ్యతలను జేపీ నడ్డా స్వీకరించడం లాంఛనంగా కన్పిస్తోంది. అగ్రనాయకులు ఆశిస్సులు,ముఖ్యంగా మోడీ,అమిత్ షా ఆశిస్సులు నడ్డాకి పుష్కలంగా ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో యూపీ బీజేపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న నడ్డా..అధికసీట్లను సాధించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. నడ్డా ఎన్నిక ఏకగ్రీవం కానున్నట్లు తెలుస్తోంది.