TV Screen: లక్షల్లో దొంగతనం చేయడమే కాకుండా “ఐలవ్‌యూ” అని రాసిన దొంగలు

ఘరానా దొంగలు ఇంట్లో చొరబడి దొంగతనం చేయడమే కాకుండా ఆ ఇంట్లో "ఐ లవ్ యూ" అనే మెసేజ్ రాశారు. సౌత్ గోవాలోని మార్గోవ్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లాలోకి చొరబడి, రూ. 20 లక్షలకు పైగా విలువైన వస్తువులను దొంగిలించారు.

Tv Screen

 

 

TV Screen: ఘరానా దొంగలు ఇంట్లో చొరబడి దొంగతనం చేయడమే కాకుండా ఆ ఇంట్లో “ఐ లవ్ యూ” అనే మెసేజ్ రాశారు. సౌత్ గోవాలోని మార్గోవ్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.

గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లాలోకి చొరబడి, రూ. 20 లక్షలకు పైగా విలువైన వస్తువులను దొంగిలించారు. ఆ తర్వాత ఇంటి యజమానికి “ఐ లవ్ యూ” అనే సందేశాన్ని వదిలివేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

ఇంటి యజమాని అసిబ్ 2 రోజుల సెలవు తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడే అతని బంగ్లా చోరీకి గురైనట్లు తెలిసింది. మార్గోవ్ పోలీసు స్టేషన్‌కు చెందిన అధికారి మాట్లాడుతూ.. 20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.

Read Also: బుక్ ఫెయిర్‌లో దొంగతనం చేసి దొరికిపోయిన ఆ హీరోయిన్

“దొంగలు టెలివిజన్ స్క్రీన్‌పై మార్కర్‌తో ‘ఐ లవ్ యు’ అని రాసినట్లు యజమానికి కనిపించిందని.. అది చూసి అతను ఆశ్చర్యపోయాడు,” అని అధికారి తెలిపారు.

మంగళవారం మార్గోవ్ పోలీసులకు కంప్లైంట్ చేయగా, గుర్తుతెలియని కొందరు అనుమానితులపై దొంగతనం కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సచిన్ నార్వేకర్ తెలిపారు.