Karnataka
Old Couple Marriage : ప్రేమ ఎంత బలీయమైందో చెప్పడానికి గురువారం కర్ణాటకలో జరిగిన పెళ్లే నిదర్శనం. 35 ఏళ్ల క్రితం ప్రేమించుకుని,అనుకోని కారణలతో దూరమైన ఓ జంట మళ్లీ 65 ఏళ్ల వయస్సుల్లో ఏడడుగులు నడిచింది.
మైసూరులోని హెబ్బాళ ప్రాంతానికి చెందిన చిక్కణ్ణ(65), అదే ప్రాంతానికి చెందిన జయమ్మ(65)కి 35 ఏళ్ల క్రితం పరిచమైంది. వీరి పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. ఒకరంటే మరొకరికి గాఢమైన ప్రేమ. అయితే చిక్కణ్ణకు జయమ్మను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. జయమ్మని మరొకరికిచ్చి వివాహం చేశారు. అయితే ప్రేయసి దక్కలేదన్న ఆవేదనతో చిక్కణ ఒంటరిగానే మిగిలిపోయాడు తప్ప వేరెవ్వరినీ తన జీవితంలోకి రానీయలేదు.
ఈ క్రమంలో కొంత కాలానికి జయమ్మ భర్త చనిపోయాడు. ఆమెకు పిల్లలు లేరు. అప్పటినుంచి ఇద్దరూ తమ పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ వేర్వేరుగానే ఉంటూ వచ్చారు. చివరకు సమాజాన్ని, కట్టుబాట్లను కాదని గురువారం మండ్య జిల్లా మేలుకోటె చెలువనారాయణుడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆశ్రమంలో వీరిద్దరూ శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ALSO READ Omicron : అమెరికాలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..న్యూయార్క్ లో కొత్తగా ఐదు