PM Modi : డిజిటల్ ఇండియాకి ఆరేళ్లు.. ఈ డికేడ్ ఇండియా టెకేడ్

డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మానికి నేటితో ఆరేళ్లు పూర్తి అయిన నేప‌థ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు.

Pm Modi (7)

PM Modi డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మానికి నేటితో ఆరేళ్లు పూర్తి అయిన నేప‌థ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ఐటీ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ సహా పలువురు నేతలు, అధికారులు హాజరయ్యారు. ఈ ఆరేళ్ల కాలంలో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు కేంద్రం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. పేర్కొన్నారు. సాంకేతికత సాధికారతలో డిజిటల్​ ఇండియాది కీలక పాత్ర అని తెలిపారు. డేటా మరియు జనాభా డివిడెండ్ భారతదేశానికి ఒక భారీ అవకాశాన్ని అందిస్తున్నాయన్నారు. మనందరం కలిసికట్టుగా ఈ దశాబ్దాన్ని భారతదేశపు టెకేడ్(టెక్నాలజీలో దూసుకెళ్లడం)గా మార్చడంలో విజయం సాధిస్తామని మోదీ అన్నారు. 21వ శ‌తాబ్ధ‌పు భార‌త నినాదం డిజిటిల్ ఇండియా అని ఆయ‌న అన్నారు. కోవిడ్ వేళ డిజిటిల్ ఇండియా ఎంత స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసిందో చూశామ‌న్నారు. అభివృద్ధి చెందిన దేశాలు విఫ‌ల‌మైన వేళ‌ మ‌నం నేరుగా బ్యాంకు అకౌంట్లలోకి నగదును బ‌దిలీ చేశామ‌న్నారు. ఆ నగదు సుమారు రూ. 7 ల‌క్ష‌ల కోట్లు ఉంటుంద‌న్నారు.

డిజిటల్ ఇండియా మిష‌న్ ద్వారా మౌళిక స‌దుపాయాల అభివృద్ధిపై ఫోక‌స్ పెట్టిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. అనేక ప్ర‌పంచదేశాలు కోవిన్ పోర్ట‌ల్ ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌రిచిన‌ట్లు తెలిపారు. కోవిన్ ద్వారా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ .. మ‌న టెక్నాల‌జీ సామ‌ర్థ్యాన్ని నిరూపించింద‌న్నారు. ఆన్‌లైన్ విద్య‌, వైద్య కోసం డెవ‌ల‌ప్ చేసిన ఫ్లాట్‌ఫామ్స్ కోట్లాది మంది భార‌తీయుల‌కు ఉప‌యోగ‌ప‌డిన‌ట్లు ఆయ‌న చెప్పారు. డిజిలాక‌ర్ ద్వారా డిజిటిల్ ఇండియా సామ‌ర్థ్యం తెలుస్తుంద‌న్నారు. స్కూల్‌, కాలేజీ డాక్యుమెంట్లు, ఆధార్‌, ప్యాన్, ఓట‌ర్ కార్డుల‌ను డిజీలాక‌ర్‌లో ఈజీగా దాచుకోవ‌చ్చన్నారు. డిజిట‌ల్ ఇండియా వ‌ల్లే వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డు అమ‌లు సాధ్య‌మైంద‌న్నారు.

ఈ సందర్భంగా మోదీ డిజిటల్ ఇండియా లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డిజిటల్​ ఇండియా సాధించిన విజయాలు, ప్రభుత్వానికి ప్రజలను దగ్గర చేయడంలో డిజిటల్ ఇండియా పాత్ర.. అలాగే ఈ పథకం భవిష్యత్ కార్యచరణ గురించి వివరించారు. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన సుహానీ సాహు, దీక్ష అనే లబ్ధిదారులతో ప్రధాని ఈ సందర్భంగా ముచ్చటించారు. 5 వ తరగతి చదువుతున్న విద్యార్థి సుహానీ సాహు తన అధ్యయనాల వివరాలను ప్రధానితో పంచుకున్నారు. సుహానీ సాహు మాట్లాడుతూ… మేము వాట్సాప్‌లో ఒక లింక్‌ను అందుకుంన్నాము. అక్కడ మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. ప్లాట్‌ఫామ్‌లో చాలా కార్టూన్లు కూడా ఉన్నాయి అని చిన్నారి ప్రధానితో వివరించారు. ఆవిష్క‌ర‌ణ కోసం ఆస‌క్తి ఉంటే.. టెక్నాల‌జీని వేగంగా అందిపుచ్చుకోవ‌చ్చు అని ప్రధాని తెలిపారు. డేటా మరియు జనాభా డివిడెండ్ భారతదేశానికి ఒక భారీ అవకాశాన్ని అందిస్తున్నాయన్నారు. మనందరం కలిసికట్టుగా