Sonia Gandhi : మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల.. మా పూర్తి మద్ధతునిస్తాం : సోనియా గాంధీ

గతంలో మహిళా బిల్లును ఆమోదింపజేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో యత్నించిందని కానీ అప్పట్లో పలువురు ఈ బిల్లును అడ్డుకున్నారని కానీ ఇప్పుడు ఆ బిల్లు మరోసారి లోక్ సభకు వచ్చింది. కానీ తాము అడ్డుకోసం పూర్తిగా మద్దతు ఇస్తాం అని స్పష్టంచేశారు.

Women Reservation Bill..Sonia Gandhi

Women Reservation Bill..Sonia Gandhi: భారత స్త్రీలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మహిళా బిల్లు (Women Reservation Bill)ను ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తాజాగా తెరపైకి తెచ్చింది. మోదీ కేబినెట్ ఆమోదం పలికిన తరువాత బుధవారం (సెప్టెంబర్ 19,2023)న లోక్ సభలో మహిళా బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. ఈరోజు ఆ బిల్లుపై లోక్ సభలో చర్చ కొనసాగుతోంది. ఈ బిల్లుపై చర్చకు ఏడు గంటలు కేటాయించారు.

దీంట్లో భాగంగా కాంగ్రెస్ అధినేతి సోనియాగాంధీ మాట్లాడుతు..గతంలో మహిళా బిల్లును ఆమోదింపజేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో యత్నించిందని కానీ అప్పట్లో పలువురు ఈ బిల్లును అడ్డుకున్నారని కానీ ఇప్పుడు ఆ బిల్లు మరోసారి లోక్ సభకు వచ్చింది. కానీ తాము అడ్డుకోసం పూర్తిగా మద్దతు ఇస్తాం అని స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కాంగ్రెస్ దశాబ్దాలుగా పోరాడుతోందని ఈ సందర్భంగా సోనియాగాంధీ గుర్తు చేశారు. మహిళా బిల్లు ఆమోదం పొందాలని రాజీవ్ గాంధీ ఎంతగానో ఆకాంక్షించారని ఈ బిల్లు రాజీవ్ గాంధీ కల అంటూ సోనియా గుర్తు చేశారు. ఇంకా సోనియాగాంధీ మాట్లాడుతు..“ఇది నా జీవితంలో కూడా ఒక భావోద్వేగ ఘట్టం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించే రాజ్యాంగ సవరణను మొదటిసారిగా నా జీవిత భాగస్వామి రాజీవ్ గాంధీ తీసుకువచ్చారు. ఇది రాజ్యసభలో ఓడిపోయింది. సభ 7 ఓట్ల తేడాతో.. తర్వాత పీఎం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించింది’’ అని అన్నారు.

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం లాంఛనమే.. అయితే ఎప్పటి నుంచి అమలు చేస్తారో తెలుసా?

రాజ్యసభలో మొదటిసారిగా మహిళా బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ అనే విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని..కానీ అప్పుడు కొంతమంది అడ్డుకున్నారని కానీ తాము అడ్డుకోము తమ పూర్తి మద్ధతునిస్తాం అని స్పష్టంచేశారు. ఇప్పటికైనా మహిళా బిల్లును ప్రవేశపెట్టటం దానిపై చర్చ జరగటం సంతోషించాల్సిన విషయం అని అన్నారు. భారత నారీ శక్తి గొప్పదన్నారు. ప్రతీ పురుషుడు విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందన్నారు. ఈ మహిళా బిల్లు ఆమోదం పొంది మహిళా సాధికారతకు తోడ్పాటునివ్వాలని సోనియాగాంధీ ఆకాంక్షించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం లాంఛనమే.. ఎప్పటి నుంచి అమలు అంటే..
కాగా ఈ బిల్లు ఆమోదం పొందితే ఇక చట్టసభల్లో మహిళా ప్రతినిధుల సంఖ్య పెరగనుంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. ప్రస్తుతం ఉన్న 82 స్థానాల నుంచి 182కు పెరగునుంది మహిళా ఎంపీల సంఖ్య. కాగా ఈ బిల్లు విషయంలో గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే..బిల్లు ఆమోదం ఇక నామ మాత్రమే అనే విషయం స్పష్టమవుతున్న క్రమంలో ఈ బిల్లు ఆమోదం లభించినా ఇప్పట్లో అమలులోకి వచ్చేలా కనిపించడం లేదు. అంటే..2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇది అమలు కాకపోవచ్చని తెలుస్తోంది. కారణం, ఇందులో ప్రభుత్వం రెండు విషయాల్ని ప్రధానంగా ప్రస్తావించింది. జనాభా లెక్కలు ఒకటైతే, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన అనంతరమే ఇది అమలులోకి వస్తుందని ప్రభుత్వం చెప్పింది. వాస్తవానికి జనాభా లెక్కలు 2021లోనే ముగియాలి. కానీ, కొవిడ్ సహా ఇత్యాది కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక నియోజకవర్గాల పునర్విభజన 2026లో చేస్తారని తెలుస్తోంది.

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్‭ బిల్లుపై విపక్షాల డిమాండుకు ఉమాభారతి మద్దతు.. ఇరకాటంలో బీజేపీ

కోటాలో కోటా ఉండాల్సిందేనంటూ మాయావతి డిమండ్..
కాగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ బిల్లుపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి మద్దతు పలుకుతునే భారీ డిమాండే లేవనెత్తారు. మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తమ పార్టీ స్వాగతిస్తుందని చెప్పారు. అంటే, మహిళా రిజర్వేషన్‌ కోటాలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కోటా కేటాయించాలని ఆమె డిమాండ్‌ చేశారు. దేశంలో ఉన్న కులాల వర్గీకరణ ఆధారంగా వెనుకబాటుకు గురైన వారిలో అన్ని వర్గాల మహిళలు ఉన్నారని, వెనుకబడిన సామాజిక వర్గాల మహిళలు మరింత వెనుకబడిపోయి ఉన్నారని, వారికి చేయూతనివ్వడం నైతిక బాధ్యతని మాయావతి అన్నారు.