×
Ad

Obesity Drug Mounjaro: దేశంలో అత్యధికంగా అమ్ముడైన మందు ఇదే.. దేనికోసం వాడతారంటే..

ఇంకా విశేషమేమిటంటే? మార్చిలో భారత్ లో ప్రారంభించిన ఏడు నెలలకే మౌంజారో ఈ మైలురాయిని చేరుకుంది.

Obesity Drug Mounjaro: అదొక మందు. దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన డ్రగ్ గా గుర్తింపు పొందింది. అదేమిటంటే.. మౌంజారో. ఒబెసిటీ, డయాబెటిస్ నివారణ ఔషధం మౌంజారో మొదటిసారిగా భారతీయ ఫార్మాస్యూటికల్ మార్కెట్‌లో విలువ పరంగా అగ్రస్థానానికి చేరుకుంది. అక్టోబర్‌లో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఫార్మారాక్ డేటా ప్రకారం, ఈ ఔషధం ఈ నెలలో దాదాపు 100 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. నెలవారీగా చూస్తే దాదాపు 25% వృద్ధి చెందింది. GSK దీర్ఘకాల మార్కెట్ లీడర్ ఆగ్మెంటిన్‌ను మౌంజారో అధిగమించింది.

ఇంకా విశేషమేమిటంటే? మార్చిలో భారత్ లో ప్రారంభించిన ఏడు నెలలకే మౌంజారో ఈ మైలురాయిని చేరుకుంది. ఇప్పటికే 333 కోట్ల అమ్మకాలను సాధించింది. ఇది దేశంలో బరువు తగ్గడం, మెటాబాలిక్ హెల్త్ చికిత్సలకు పెరుగుతున్న డిమాండ్‌కు స్పష్టమైన సంకేతం.