Tricolor Dresses
Independence Day 2023 : ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకుంటాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులకు నివాళులు అర్పించి వారిని స్మరించుకుంటాం. ఈ సందర్భంలో స్కూళ్లు, కాలేజీలు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరేస్తారు. సెల్యూట్ చేస్తారు. అయితే చాలామంది జాతీయ జెండాలోని రంగులతో తయారు చేసిన దుస్తులు ధరిస్తారు. అనేక వస్తువులు కూడా ఈ రోజు వాడతారు. అలా ధరించవచ్చునా?
Independence Day 2023 : భారత్‌తో పాటు ఆగస్టు 15న స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకునే దేశాలు
ఆగస్టు 15 వస్తోందనగానే చాలా చోట్ల జాతీయ జెండా రంగుల్లో దుస్తులు అమ్ముతారు. చాలామంది ఇష్టంగా కొనుక్కుని ధరించి దేశభక్తిని చాటుకుంటారు. ఇలా జాతీయ జెండా రంగుల్లో దుస్తులు ధరించడంలో తప్పు లేదు. అయితే దానికి సంబంధించిన కొన్ని నియమాలు మాత్రం పాటించాలి. దీనికి సంబంధించి 2005లో లోక్‌సభ ఒక బిల్లును ఆమోదించింది. భారతీయ పౌరులు గౌరవప్రదంగా ధరిస్తే వారి దుస్తులలో భాగంగా త్రివర్ణాన్ని ధరించవచ్చును అని పేర్కొంది. అయితే 2005లోని సెక్షన్ 2 (ఇ) ప్రకారం జాతీయ జెండాను ఎవరూ నడుము కింద్రి నుంచే ధరించే దుస్తుల్లో వాడరాదు. జాతీయ జెండాను ఎలాంటి డ్రెస్ మెటీరియల్ పైన ముద్రించకూడదు అని స్పష్టం చేసింది.
చట్టం ప్రకారం నడుము క్రింద భాగంలో ఎవరూ త్రివర్ణ పతాకాన్ని ధరించకూడదు. కుషన్లు, రుమాలు మరియు లో దుస్తులు వంటి రోజువారి ఉపయోగంలో వాడరాదు. కోడ్ ను ఉల్లంఘిస్తే కనీసం సంవత్సరకాలం జైలు శిక్ష విధిస్తారు. మూడు రంగుల టీ షర్టు, చీర, దుపట్టా లేదా తలపాగా, చెవి పోగులు, బ్యాంగిల్స్ వంటి ఉపకరణాల్లో రంగులు చేర్చుకోవచ్చు.