లాక్ డౌన్ కష్టాలు 2.0 : వలస కూలీలపై విరిగిన లాఠీ

  • Publish Date - April 14, 2020 / 01:13 PM IST

‘కూటీ కోసం..కూలీ కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం..ఎంత కష్టం’…ఇది సినిమాలో పాట.  కానీ అచ్చం ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో నెలకొంది. దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. 21 రోజుల పాటు కొనసాగిన లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగిస్తున్నట్లు (2020, మే 03వ తేదీ వరకు) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.

కానీ తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కూలీలు ప్రయత్నించారు. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం సాయంత్రం బాంద్రా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా వందల మంది గుమికూడారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా..భారీగా రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్ కు చేరుకని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు వినిపించుకోలేదు. ప్రత్యేక రైళ్లు నడపాలని తమ గ్రామాలకు వెళ్లిపోతామని నినదించారు.వీరంతా  యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారుగా తెలుస్తోంది. 

ఎంతకు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. బతుకు జీవుడా..అంటూ పరుగెత్తారు. ఎంతో మంది కిందపడిపోయారు. పలువురికి గాయాలైనట్లు సమాచారం. రైల్వే స్టేషన్ లో ఎక్కడ చూసినా చెప్పులే కనిపించాయి. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

ఒక రోజు కాదు..రెండు రోజులు కాదు..2020, ఏప్రిల్ 23వ తేదీ నుంచి కొనసాగుతోంది. తొలుత 21 రోజుల పాటు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. దీంతో ఎక్కడికక్కడే రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో వలస కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉన్న డబ్బు..తిండి..మొత్తం అయిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిని ఆదుకుంటామని ప్రభుత్వాలు చెబుతున్నా..అనుకున్న మేర సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో స్వస్థలాలకు వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారు.

మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో…లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. 135 కోట్ల భారతదేశంలో కేవలం వందల సంఖ్యలోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీనికి లాక్‌డౌన్‌ విధించడమే కారణం. పరిస్థితి దేశంలో ఇప్పటికీ అదుపులోనే ఉంది. చేయి దాటిపోలేదంటే దానికి కారణం లాక్‌డౌన్‌ అని చెప్పకతప్పదు.

కరోనా వైరస్‌కు స్వీయనియంత్రణే మందని అందరూ చెబుతున్నారు. ఈ స్వీయనియంత్రణ లాక్‌డౌన్‌తోనే సాధ్యమయ్యింది. ప్రజలంతా ఇళ్లకు పరిమితం అయ్యారు. దీంతో వైరస్‌ ఎక్కువ మందికి విస్తరించడానికి అడ్డుకట్ట పడినట్టయ్యింది. భారతదేశంలాంటి ఇంత పెద్దదేశంలో లాక్‌డౌన్‌ విధించకపోయి ఉంటే మాత్రం పెను ప్రమాదమే సంభవించేంది. ఇటలీ, స్పెయిన్‌, అమెరికాకంటే మన పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేది.‌…

 

Also Read |  ప్రేమ పేరుతో వివాహితపై వల… గర్భవతిని చేసి…