×
Ad

Jammu And Kashmir : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్, ముగ్గురు సైనికుల మృతి

జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్ కౌంటరులో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. దక్షిణ కశ్మీరులోని కుల్గాం జిల్లా హాలన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేర కేంద్ర భద్రతాబలగాలు జమ్మూకశ్మీరు పోలీసులతో కలిసి గాలింపు చేపట్టారు...

  • Published On : August 5, 2023 / 05:36 AM IST

Jammu And Kashmir Encounter

Jammu And Kashmir : జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్ కౌంటరులో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. దక్షిణ కశ్మీరులోని కుల్గాం జిల్లా హాలన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేర కేంద్ర భద్రతాబలగాలు జమ్మూకశ్మీరు పోలీసులతో కలిసి గాలింపు చేపట్టారు.

Electric Shock : విద్యుత్ షాక్ తో ఇద్దరు కూలీలు, రక్షించేందుకు వెళ్లిన అంగన్ వాడీ ఆయా మృతి

ఈ గాలింపు సందర్భంగా ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ( Encounter In Jammu And Kashmir) ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు సైనికులు మరణించారు. (Army Personnel Killed) ఎదురుకాల్పుల ఘటన అనంతరం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నామని శ్రీనగర్ ప్రాంతానికి చెందిన చీనార్ కార్ప్ ఆర్మీ ట్వీట్ చేసింది. ముగ్గురు జవాన్లు ఎదురుకాల్పుల్లో మరణించిన తర్వాత అదనపు సైనిక బలగాలతో ఉగ్రవాదుల కోసం గాలింపును కొనసాగిస్తున్నారు.