Tamil Nadu fearing failure in NEET : వైద్య విద్య ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. కానీ తాము పరీక్షల్లో విపలం చెందుతామనే భయంతో శనివారం మధురై, ధర్మపురి, నమ్మక్కల్ లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్ష కోసం బాగానే సిద్ధమయ్యాయని, కానీ ఇప్పటికీ భయపడుతున్నట్లు, వైద్య విద్యలో సీటు రాకపోతే..ఏమవుతుందని అంటూ ఓ ఆడియో టేపును తల్లిదండ్రులకు పంపి మధురైకి చెందిన ఎం. జోతి దుర్గా సూసైడ్ చేసుకుంది.
తండ్రి సబ్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్నారు. తమిళనాడు స్పెషల్ పోలీస్ VI బెటాలియన్ క్వార్టర్స్ లో జోతి కుటుంబం నివాసం ఉంటోంది. గతంలో నీట్ పరీక్షకు హాజరై 110 మార్కులు సాధించడంతో సీటు రాలేదని కుటుంబసభ్యులు వెల్లడించారు. పోస్టుమార్టం కోసం రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. Thathaneri లో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ మంత్రి ఆర్. బి. ఉదయ్ కుమార్ జొతి కుటుంబాన్ని పరామర్శించారు. డీఎంకే యువజన నాయకుడు ఉదయనిధి ఆ కుటుంబాన్ని ఓదార్చి…రూ. 5 లక్షల చెక్కును అందచేశారు.
ధర్మపురిలో ఆదిత్య శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు మణివన్నన్, జయచిత్రలతో కలిసి సెంథిల్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. రెండు సార్లు నీట్ పరీక్ష రాశాడు. మూడోసారి పరీక్షకు సిద్ధమౌతున్నా..ఏదో తెలియని భయం నెలకొంది. ఇంటి వద్దే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు సూపరిటెండెంట్ ప్రవీష్ కుమార్ ఇంటిని పరిశీలించారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు.
నమ్మక్క జిల్లాలోని తిరుచెంగోడ్ లోని మోతిలాల్ లో మోతీలాల్ (21) నివాసం ఉంటున్నాడు. ఇతని తండ్రి మురుగేసన్ ఎలక్ట్రిక్ షాపు నిర్వహిస్తున్నాడు. మోతీలాల్ 2017లో 12వ తరగతి పరీక్షలో 1, 081 మార్కులు సాధించాడు. సూసైడ్ లభ్యం కాలేదని, నమ్మక్కల్ పోలీస్ సూపరింటెండెంట్ ఎస్.శక్తి తెలిపారు.
తమిళనాడులో విద్యా వ్యవస్థ బలపడే వరకు నీట్ ను రద్దు చేయాలని DMK Tirupparankundram MLA P. Saravanan వెల్లడించారు. నీట్ పరీక్ష పట్ల కొంతమంది విద్యార్థులు భయం చెందుతున్నారని, దేశ వ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష అశాస్త్రీయమన్నారు. 412 ప్రభుత్వం నిర్వహించే కోచింగ్ సెంటర్లలో 19 వేల మంది విద్యార్థులు కోచింగ్ తీసుకున్నా..ఎవరకీ వైద్య విద్యలో ప్రవేశం పొందలేదన్నారు. గ్రామీణ విద్యార్థులకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. నీట్ ప్రవర్తనకు వ్యతిరేకంగా..మధురైలో ప్రదర్శన నిర్వహించారు.