Tadoba Forest : అటవీశాఖ అధికారిణిపై పులి దాడి

దేశవ్యాప్తంగా పులుల గణన కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అటవీశాఖ అధికారులు మ‌హారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా తాడోబా అభ‌యార‌ణ్యంలో పులుల గణన చేపట్టారు.

Tadoba Forest :  దేశవ్యాప్తంగా పులుల గణన కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అటవీశాఖ అధికారులు మ‌హారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా తాడోబా అభ‌యార‌ణ్యంలో పులుల గణన చేపట్టారు. ఈ సమయంలోనే అటవీశాఖ మహిళ అధికారిణిపై ఓ పులి దాడి చేసి పొదల్లోకి తీసుకెళ్లింది. పులిదాడిలో సదరు అధికారిణి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ మిగతా అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు.

చదవండి : Tigers Attack On Cows : ఖమ్మం జిల్లా వాసులను వణికిస్తున్న పులుల సంచారం

ఇక ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా పులుల దాడులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రాల్లో గత మూడు నెలల్లో అనేక దాడులు జరిగాయి. జనావాసాల్లోకి వస్తు సాధుజంతువులపై దాడులు చేస్తున్నాయి పులులు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ ఆవుపై దాడి చేసి చంపగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లేగదూడలను చంపింది పులి. తరుచుగా ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటుండడం అటవీ శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

చదవండి : Tiger on Roads: రోడ్లపై దర్జాగా తిరుగుతున్న పులి!

ట్రెండింగ్ వార్తలు