Tiktok పూర్తిగా బంద్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రముఖ సోషల్ మీడియా టిక్ టాక్ పూర్తిగా బంద్ అయిపోయింది. కేంద్రం ప్రకటించిన వెంటనే క్లోజ్ అవకపోయినా.. కొద్దిగంటల్లోనే చర్యలు తీసుకుంది ప్రభుత్వం. హై లెవల్ లో బ్లాకింగ్ చేస్తుండటంతో ఇప్పట్లో టిక్ టాక్ తో పాటు ఇతర చైనీస్ యాప్ లు పున ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
14 భాషల్లో ఉన్న టిక్ టాక్ లో లక్షల కొద్దీ అకౌంట్లు కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. గ్రామాల్లో ఉన్న వారంతా వయస్సుతో సంబంధం లేకుండా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ టిక్ టాక్ ఫన్ క్రియేట్ చేసేవారు. దీంతో పాటుగా టిక్ టాక్ హింసను ప్రేరేపించిలా కూడా ఉందని, దేశ ప్రజల రక్షణ రీత్యా భారత ప్రజల ఫోన్లలో ఉండటం సేఫ్ కాదని కేంద్రం నిర్ణయించింది.
యాప్ లు బ్లాక్ చేయడం అంత సులువు కాదని భావించిన వారికి గూగుల్ షాక్ ఇచ్చింది. ముందుగా ప్లే స్టోర్లలో డౌన్ లోడ్ చేసుకునేందుకు యాప్ ను తొలగించి ఆ తర్వాత ఫోన్లలో ఆపరేట్ చేసుకునేందుకు వీలు లేకుండా చేసింది. ప్రభుత్వం ఇప్పటికే తమ నిర్ణయాన్ని తెలియజేయాలంటూ 48 గంటల సమయం ఇచ్చింది. అయినప్పటికీ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో 24గంటల్లోపే క్లోజ్ చేసేసింది.